Undavalli Arun Kumar Interesting Comments On Chiranjeevi And Polavaram Projects: ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల దినోత్సవ వేడుకల సమయంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సమర్థించారు. చిరు చెప్పినట్లు సినీ పరిశ్రమ నిజంగా పిచ్చుకే కానీ.. చిరంజీవి మాత్రం కాదన్నారు. ఎందుకంటే.. రాష్ట్ర విభజన సమయంలో ఆయన కేంద్రమంత్రిగా పార్లమెంట్‌లో గట్టిగా మాట్లాడారని గుర్తు చేశారు. మంత్రిగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది అంత ఆషామాషీ విషయం కాదన్నారు. చిరంజీవి మాట్లాడటం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చిందన్నారు. అలాంటి వ్యక్తి ప్రత్యేక హోదాపై పోరాడమని మంత్రులకు సలహా ఇవ్వడంలో ఏమాత్రం తప్పు లేదని చెప్పుకొచ్చారు. రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Sanjay Raut: అప్పుడు బీజేపీ తిరస్కరించినందుకే షిండేను సీఎం చేయలేదు..
ఉండవల్లి ఇంకా మాట్లాడుతూ.. ఆంధ్ర కంటే తెలంగాణ ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. వాస్తవానికి టీడీపీ హాయంలో కంటే వైసీపీ హాయంలోనే 18 శాతం అదనంగా ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరిగాయన్నారు. పత్రికను, ఛానల్స్‌ను అడ్డు పెట్టుకుని రామోజీరావు అక్రమాలు, అవకతవకాలు పాల్పడ్డారని ఆరోపించారు. విదేశాలకు కళాంజలి కళకృతులు అని కేంద్ర ప్రభుత్వ చర్యలను పత్రికలో రాసినందుకు సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్‌పై కేసు పెట్టారన్నారు. ఈ కేసులో రామోజీరావుపై పోరాడలేక ఏబీకే ఫైన్ కట్టి బయటపడ్డారని చెప్పారు. డబ్బున్న వారికే కోర్టులో న్యాయం జరుగుతుందన్నారు. లీగల్‌గా మార్పు అవసరమని సూచించారు. ప్రభుత్వం సహకరిస్తోంది కాబట్టి మార్గదర్శిపై పోరాటం చేస్తున్నానన్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదని, ప్రభుత్వాలు మారిన ఈ ప్రాజెక్టు పూర్తి కాదని రుజువైందని అన్నారు. టీడీపీ, వైసీపీ కాకుండా వేరే ప్రభుత్వం రావాలన్నారు.
Rahul Gandhi: మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ టార్గెట్‌గా రాహుల్ గాంధీ విమర్శలు