ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నది. రష్యన్ సేనలు పెద్ద ఎత్తున ఉక్రెయిన్‌లోకి ప్రవేశించి యుద్ధం చేస్తున్నాయి. కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటున్నారు. రష్యన్ సేనలు నగరాల్లోకి ప్రవేశిస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. నగరాల్లోకి ప్రవేశించిన సేనలు ట్యాంకులకు ఆయిన్ ను నింపుకోవడానికి ఆగినపుడు మాల్స్‌లోకి ప్రవేశించి దుస్తులు, డ్రింక్స్, తినుబండారాలు అందిన కాడికి దోచుకొని పోతున్నారు. ఓ స్టాల్ లోకి ప్రవేశించిన సైనికులు వివిధ వస్తువులను లూటీ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. రష్యన్ సైనికులు చేసిన ఈ పనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read: War Effect: భారీగా పెరగనున్న ఈవీ కార్లు…స్మార్ట్‌ఫోన్ ధరలు…
Occupiers looting a #Ukrainian store pic.twitter.com/jPKbHLDEeR
— NEXTA (@nexta_tv) February 27, 2022