putin orders partial mobilization of citizens: ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కీలక మలుపుతిరగబోతోంది. ఇప్పట్లో యుద్ధాన్ని ముగించేలా లేదు రష్యా. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాక్షిక సైనిక సమీకరణకు బుధవారం ఆదేశించారు. దీంతో ఉక్రెయిన్ భూభాగాల్లోకి మరిన్ని రష్యా బలగాలు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజర్వ్ లో ఉన్న పౌరులు, అన్నింటి కన్నా ముఖ్యంగా గతంలో సాయుధబలగాల్లో పరిచేసిన, అనుభవం ఉన్నవారిని సమీకరించనున్నారు. రష్యాను బలహీన పరచాలని, విభజించాలని అనునకుంటున్న…
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనికులు దురాగతాలు ఒక్కొక్కటిగ బయటపడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ నుంచి రష్యా బలగాలు నిష్క్రమించాయి. ఈ ప్రాంతాన్ని మళ్లీ ఉక్రెయిన్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. తిరిగి ఆధీనంలోకి తీసుకున్న ప్రాంతాల్లో రష్యా బలగాలు చేసిన అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇజియమ్ ప్రాంతంలో 400లకు పైగా మృతదేహాలను ఉక్రెయిన్ అధికారులు గుర్తించారు. దీంట్లో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
PM Modi holds bilateral talks with Russian President Putin: ఉజ్జెకిస్తాన్ లో జరుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) సమావేశంలో పాల్గొనేందుకు సమర్ కండ్ వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. రష్యా, ఉక్రెయిన్ ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తో తొలిసారిగా సమావేశం అయ్యారు. ఇరు దేశాల కూడా ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుకున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది యుద్ధాల యుగం…
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశాన్ని వదిలిపెట్టి ఇండియాకు చేరుకున్న వైద్య విద్యార్థుల కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు ఇండియాలోని వైద్య కళాశాల్లో అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ప్రమాదానికి గురయ్యారని, అయితే ఆయన క్షేమంగా ఉన్నారని ఆయన ప్రతినిధి తెలిపారు.
ఈ యుద్ధంలో రష్యాకు ఉక్రెయిన్ సేనలు భారీ షాకిచ్చాయి. ఉక్రెయిన్‌లోని ఖార్ఖీవ్ ప్రావిన్స్‌లో కీలక నగరమైన ఇజియంను రష్యా నుంచి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది.
More than 300 children died in the war between Russia and Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడు నెలలకు చేరింది. ఇప్పటికీ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. రష్యా దాడిలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. యుద్ధం ప్రారంభం అయ్యే ముందు పటిష్టమైన రష్యా ముందు కేవలం వారాల వ్యవధిలోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా అనుకున్నారు. అయితే పాశ్చాత్య దేశాలు, అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు…
Ukraine in Top: రష్యా దురాక్రమణతో సర్వం కోల్పోయిన ఉక్రెయిన్ టాప్లో నిలవటమేంటి, అసలు ఆ దేశం ఎందులో టాప్లో నిలిచిందని అనుకుంటున్నారా?. నమ్మబుద్ధి కాని నిజమిది. డిజిటల్ కరెన్సీలో ఉక్రెయిన్ నంబర్ వన్ ర్యాంక్ సాధించింది. 2021లో ఆ దేశంలో 12.7 శాతం మంది వద్ద ఇ-నగదు ఉంది.