అమెరికాకు సమస్య వస్తే ప్రపంచానికి సంక్షోభమే..2008లో జరిగింది ఇదే.. ఇప్పుడు జరుగుతున్నదీ అదే.. అమెరికా ద్రవ్యోల్బణం 40ఏళ్ల గరిష్టానికి పెరిగింది.దాన్ని కంట్రోల్ చేయటానికి తీసుకుంటున్న చర్యలు ప్రపంచ దేశాలను సంక్షోభం ముంగిట నిలుపుతున్నాయి..కరోనా కష్టాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా మాద్యం అన్నీ కలిసి ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయా? ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రణాళికలు వేసినా అది ఆర్తిక పరిస్థితి బాగున్నంత వరకే..జేబు నిండుగా ఉంటే, ఆ డబ్బుకి విలువ ఉంటే లోకమంతా…
జూన్ చివరి నాటికి రష్యా 40వేల మందికి పైగా సైనికులను కోల్పోయే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ జెలెన్‌స్కీ అన్నారు. “రష్యన్ సైన్యం డాన్‌బాస్‌లో రిజర్వ్ దళాలను మోహరించడానికి ప్రయత్నిస్తోందని.. అయినా వారు ఏం సాధించారని” ఆదివారం ఆయన వ్యాఖ్యానించారు. జూన్‌లో రష్యా 40వేలకు పైగా సైనికులను కోల్పోవచ్చని.. వారు అనేక దశాబ్దాలుగా చేసిన ఏ యుద్ధంలోనూ అంతమంది సైనికులను కోల్పోయి ఉండదని జెలెన్‌స్కీ వివరించారు. ఎనిమిదేండ్లుగా రష్యా అనుకూల రెబెల్స్ ఆధీనంలో ఉన్న…
ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న దండయాత్రకు అంతర్జాతీయంగా ఖండన ఉన్నప్పటికీ, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదివారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు పూర్తి మద్దతును ప్రకటించారు. “రష్యా ప్రజలు అన్ని రకాల సవాళ్లు, కష్టాలను ఎదుర్కొంటూ తమ దేశం యొక్క గౌరవం, భద్రతను కాపాడుకోవడంలో గొప్ప విజయాలు సాధించారు” అని కిమ్ ఓ సందేశంలో పేర్కొన్నట్లు ప్యాంగ్యాంగ్ అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. రష్యా దినోత్సవం సందర్భంగా పుతిన్‌కు కిమ్ మద్దతు…
ఉక్రెయిన్‌లో పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్‌ను పూర్తిగా ఆక్రమించుకోవాలనే లక్ష్యానికి రష్యా దాదాపుగా చేరువైంది. అక్కడ కీలక నగరమైన సీవీరోదొనెట్స్క్‌లో ఓ రసాయన కర్మాగారంపై రష్యన్ బలగాలు భీకర దాడులు జరిపాయి. అక్కడ ఉన్న అజోట్ రసాయన కర్మాగారంపై రష్యా భారీగా ఫిరంగి గుళ్ల వర్షం కురిపించాయి. దీంతో పెద్ద ఎత్తున చమురు లీకై మంటలు ఎగిసిపడ్డాయి. ఈ కర్మాగారంలో వందల మంది ప్రజలు తలదాచుకున్నట్లు ఉక్రెయిన్ టీవీ పేర్కొంది. బాంబుల నుంచి రక్షణ కోసం ఫ్యాక్టరీ ఆవరణలోని…
తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక ప్రాంతం డాన్‌బాస్‌లో ఒక భాగమైన సీవిరోడోంటెస్క్‌ను పూర్తిస్థాయిలో చేజిక్కించుకునేందుకు రష్యా దళాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఉక్రెయిన్–రష్యా సైనికుల మధ్య వీధి పోరాటాలు జరుగుతున్నాయి. ప్రత్యర్థులతో తమ సైనికులు వీరోచితంగా తలపడుతున్నారని లుహాన్స్క్ గవర్నర్ సెర్నీ హైదాయ్ గురువారం ప్రకటించారు. గనులు, పరిశ్రమలు, సముద్రతీరంతో సుసంపన్నమైన డాన్‌బాస్‌ను హస్తగతం చేసుకునేందుకు తహతహలాడుతున్న రష్యా… ఆ ప్రాంతంలోని పలు నగరాల్లో దాడుల తీవ్రతను పెంచింది. నెలల తరబడి జరుగుతున్న యుద్ధంలో పలు పట్టణాలపై పట్టు చేజార్చుకున్న…
ఉక్రెయిన్‌పై మూడు నెలలకుపైగా యుద్ధం కొనసాగిస్తోన్న రష్యా.. తాజాగా డోన్బాస్ ప్రాంతం 97 శాతానికి పైగా తమ నియంత్రణలోకి వచ్చిందని మంగళవారం ప్రకటించింది. ముఖ్యంగా లుహాన్స్క్ ప్రాంతాన్ని పూర్తిగా స్వాదీనం చేసుకున్నామని చెప్పిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ.. పొపాస్నా, లీమన్, స్వియాటోహిర్స్‌క్ సహా 15కు పైగా నగరాలు తమ చేతికి చిక్కినట్లు వెల్లడించారు. అటు ఉక్రెయిన్ సైతం.. డొనెట్స్క్లో సగం ప్రాంతం రష్యా చేతుల్లోకి వెళ్లిపోయిందని అంగీకరించింది. అయితే.. ఈ ఎదురుదెబ్బలకు కుంగిపోవద్దని, వీధి…
రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్న వేళ పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలుస్తున్న వేళ రష్య కీలక టెస్ట్ నిర్వహించింది. ‘జిర్కాన్’ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రష్య ప్రకటించింది. బారెంట్స్ సముద్రంలోని అడ్మినరల్ గోర్ష్ కోవ్ యుద్ధనౌక నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో వైట్ సీలోని లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో చేధించిందని రష్య రక్షణ మంత్రిత్వ శాక తెలిపింది. కొత్త ఆయుధాల పరీక్షల్లో భాగంగా ఈ టెస్ట్ నిర్వహించినట్లు…
రష్యా ఉక్రెయిన్ పై దండయాత్ర ప్రారంభించి మూడు నెలలు కావస్తోంది. అయినా యుద్ధంలో వెనక్కి తగ్గడం లేదు రష్యా. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తోంది. గతంలో రాజధాని కీవ్ ను హస్తగతం చేసుకుందామని అనుకున్న రష్యా బలగాలకు ఎదురొడ్డి పోరాడింది ఉక్రెయిన్. కీవ్ ను స్వాధీనం చేసుకోవడం కుదరకపోవడంతో రష్యా, ఉక్రెయిన్ తూర్పు భాగం నుంచి మళ్లీ యుద్ధాన్ని మొదలు పెట్టింది. డాన్ బాస్, లుగాన్స్క్ ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగానే…
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయి దాదాపుగా నాలుగో నెలకు చేరింది. ఇరు దేశాలు కూడా వెనక్కి తగ్గడం లేదు. రష్యా బలగాలకు ధీటుగా ఉక్రెయిన్ నిలబడుతోంది. రష్యా, ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించిన తర్వాత నుంచి అమెరికా, నాటో దేశాలు ఆర్థికంగా, సైనికంగా సహాయపడుతున్నాయి. రష్యాను ధీటుగా ఎదుర్కొనేందు స్ట్రింగర్ మిసైళ్లు, ఇతర ఆయుధాలను, కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు సైనిక వ్యూహాలను అందిస్తున్నాయి అమెరికా, నాటో దేశాలు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ కు 40 బిలియన్…