Russian air attack on Ukraine: కొత్త ఏడాదిలో రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. మిసైళ్లు, ఇరాన్ తయారీ కామికేజ్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై సోమవారం తెల్లవారుజామున వరసగా దాడులు చేస్తోంది రష్యా. దీంతో ఉక్రెయిన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. నగరంలోని పౌరులను అలర్ట్ చేసింది ఉక్రెయిన్ ప్రభుత్వం. కీవ్ పై వైమానిక దాడి..రాజధానిలో ఎయిర్ అలర్ట్ ఆన్ లో ఉందని టెలిగ్రామ్ లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు షెల్టర్ జోన్లలో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు.
Read Also: Malla Reddy: ఏపీలోని 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ.. కాళేశ్వరం తరహాలో పోలవరం పూర్తి చేస్తాం..
మేయర్ విటాలి క్లిట్ట్కో మాట్లాడుతూ.. ఈశాన్య డెస్న్యాన్స్కీ జిల్లాలో పేలుడు సంభవించినట్లు నివేదించారు. అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. డెస్న్యాన్స్కీలో 19 ఏళ్ల వ్యక్తి గాయపడినట్లు వెల్లడించారు. రష్యా వైమానిక దాడితో ఉక్రెయిన్ గగనతల వ్యవస్థ హై అలర్ట్ ప్రకటించింది. కీవ్ ప్రాంతంలో ప్రమాదం కొనసాగుతోందని.. మా వైమానికి రక్షణ దళాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కీవ్ రిజియన్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ ఒలెక్సీకుబేలా అన్నారు. శనివారం జరిగిన రష్యా దాడిలో కీవ్, ఇతర ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఆదివారం జపొరిజ్జియా దక్షిణ ప్రాంతంలో జరిగిన ఎటక్ లో మరో వ్యక్తి చనిపోయాడు.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 10 నెలలు గడిచిపోయింది. అయినా కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాము గెలుపొందే వరకు పోరాడుతూనే ఉంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ప్రకటించారు. దీంతో ఇప్పుడప్పుడే యుద్ధం ముగియదని తెలుస్తోంది. ఇక రష్యా కూడా ఇలాగే చెబుతోంది. చర్యలకు రష్యా సిద్ధం అని చెబుతున్నా.. ఉక్రెయిన్ మాత్రం పుతిన్ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు చర్చల ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.