Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రష్యా ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరంపై క్షిపణి దాడులకు పాల్పడి విరమణ ప్రకటనకు తూట్లు పొడిచింది. రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ ఏకపక్షంగా 36 గంటల పాటు దాడులను ఆపాలని తన బలగాలను ఆదేశించినప్పటికీ తూర్పు ఉక్రెయిన్‌లోని నగరాలపై రష్యా దాడులకు పాల్పడింది. మాస్కో దళాలు తూర్పున ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం క్రమాటోర్స్క్‌పై కూడా దాడి చేశాయని ఉక్రెయిన్ అధ్యక్ష పరిపాలన డిప్యూటీ హెడ్ కైరిలో టిమోషెంకో తెలిపారు. ఆక్రమణదారులు నగరంపై రెండుసార్లు రాకెట్లతో విరుచుకుపడ్డారని ఆయన చెప్పారు. ఒక నివాస భవనం దెబ్బతిందని.. అందులో బాధితులెవరూ లేరని చెప్పారు.
ష్యాలో ఆర్థడాక్స్ క్రిస్మస్ కోసం ఉక్రెయిన్‌లో 36 గంటల కాల్పుల విరమణ పాటించాలని పుతిన్ తమ సైన్యానికి ఆదేశాలుజారీ చేసిన విషయం తెలిసందే. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి జనవరి 7 అర్థరాత్రి 12 వరకు 36 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలని రష్యా రక్షణ మంత్రిని ఆదేశించారు. ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి దాడులు చేయొద్దని గురువారం పేర్కొన్నారు. కానీ రష్యా దళాలు కాల్పుల విరమణ ఆర్డర్‌ను ఉల్లంఘించాయి. మాస్కో బలగాలు దక్షిణ నగరమైన ఖేర్సన్‌పై దాడి చేశాయని.. ఆ దాడుల వల్ల అనేక మంది మరణించారని, గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్ష పరిపాలన డిప్యూటీ హెడ్ కైరిలో టిమోషెంకో వెల్లడించారు. ఈ ఘటనలో కొన్ని నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. బాధితులను కాపాడేందుకు సహాయబృందాలు రంగంలోకి దిగాయి.
Urinating Incident on Flight: మహిళపై మూత్ర విసర్జన ఘటన.. ఎట్టకేలకు నిందితుడు అరెస్ట్
ఇదిలా ఉండగా.. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తన ఏకపక్ష కాల్పుల విరమణను గౌరవిస్తున్నట్లు తెలిపింది. తాము దాడులు చేయడం లేదని వెల్లడించింది. ఉక్రెయిన్ దళాలే దాడులను కొనసాగిస్తున్నాయని ఆరోపించింది. రెండు దేశాలు ఆర్థడాక్స్ క్రిస్మస్‌ను జరుపుకుంటాయి. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, రష్యా ఆధ్యాత్మిక నాయకుడు పాట్రియార్క్ కిరిల్, పుతిన్ మద్దతుదారు నుంచి కాల్పుల విరమణ ప్రకటించాలని వచ్చిన సూచన ప్రకారం రష్యా అధినేత విరమణ ఆర్డర్‌ను ప్రకటించారు. పిలుపులను అనుసరించి రష్యన్ నాయకుడి ఆదేశం వచ్చింది. ప్రాచీన జూలియన్ క్యాలెండర్ ప్రకారం రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి ఆధ్వర్యంలో ప్రతిఏటా జనవరి 7వ తేదీన క్రిస్టమస్ వేడుకలు జరుగుతాయి. అయితే రష్యాతోపాటు ఉక్రెయిన్‌లోనూ నివసిస్తున్నవారు కూడా జనవరి 7తేదీన ఆర్థడాక్స్ క్రిస్మస్ జరుపుకుంటారు. ఇదిలా ఉండగా 10 నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరు దేశాల సైన్యంతో సహా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
Boy Shoots Teacher: టీచర్‌ను తుపాకీతో కాల్చిన ఆరేళ్ల బుడ్డోడు.. అందుకేనా?
రష్యా ఉద్దేశాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇంతకు ముందే అనుమానాలు వ్యక్తం చేశారు. యుద్ధానికి తాత్కాలిక విరామం ఇవ్వడం ద్వారా రెట్టించిన ఉత్సాహంతో పోరును కొనసాగించాలన్నది రష్యా ఎత్తుగడ అని ఆయన ఆరోపించారు. డాన్‌బాస్‌లో ముందుకుసాగుతున్న ఉక్రెయిన్ సైనికులను నిలువరించాలన్నది వారి ఆలోచన అని ఆయన పేర్కొన్నారు. కాల్పుల విరమణ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ..‘‘పుతిన్ ఊపిరి పీల్చుకునేందుకే ఈ విరామం ప్రకటించారని నేను భావిస్తున్నాను’’ అని అన్నారు.