ఉక్రెయిన్‌పై రష్యా గత రెండేళ్లుగా యుద్ధం సాగిస్తోంది. ఉక్రెయిన్ కూడా దాడులను తిప్పికొడుతోంది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను పెంచేందుకు ఉత్తర కొరియా సాయం కోరింది. దీంతో కిమ్‌కు సంబంధించిన సేనలు రష్యాలోకి అడుగుపెట్టాయి. ఈ విషయాన్ని నాటో తాజాగా ధ్రువీకరించింది.
Putin Elon Musk: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. 2022 నుంచి వీరిద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారని తెలిపింది.
BRICS Summit: 16వ బ్రిక్స్ సమావేశం కోసం ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు రష్యాకు వెళ్లారు. రష్యాలోని కజాన్‌లో సమావేశం జరగుతుంది. రష్యాకి చేరిన ప్రధాని మోడీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఇదిలా ఉంటే, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు.
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్‌లోకి ఉత్తర కొరియా సైనికులు ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా తరుపున పోరాడటానికి కిమ్ సైన్యాన్ని పుతిన్ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. తమపై పోరాటంలో 10,000 మంది ఉత్తర కొరియా సైనికులను మోహరించడానికి రష్యా సిద్ధమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలన్ స్కీ గురువారం చెప్పారు. ఉత్తర కొరియా రష్యాకి తన సైనికులను పంపిందని జెలన్ స్కీ గతంలో కూడా ఆరోపించారు. అయితే, మొదటిసారి ఎంత మంది సైనికులను పంపించారనే విషయంపై…
Russia: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ తరుపు అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి హత్యాయత్నం నుంచి బయటపడట్టారు. కొన్ని వారాల ముందు పెన్సిల్వేనియాలోని ఓ ప్రచారంలో మాట్లాడుతున్న సందర్భంగా ట్రంప్‌పై కాల్పులు జరిగాయి, ఈ దాడిలో బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లింది, తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
Russia: రష్యా ఆర్మీలో అక్రమంగా చేరి, ఉక్రెయిన్‌తో పోరాడుతున్న భారతీయులకు విముక్తి లభించింది. 45 మంది భారతీయులను యుద్ధ ప్రాంతం నుంచి రక్షించి, రష్యా సైన్యం నుంచి డిశ్చార్జ్ చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు వెల్లడించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇంకా 50 మంది యుద్ధభూమిలో ఉన్నారని, వారిని రక్షించి విడుదల చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
Giorgia Meloni: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడంలో భారత్ పాత్ర పోషిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శనివారం అన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడంలో భారత్, చైనా పాత్ర పోషించాలని కోరారు.
Putin: అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసిసి) అరెస్ట్ వారెంట్‌ని ధిక్కరించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగోలియా పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐసీసీ గతేడాది పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఐసీసీలో సభ్యదేశాల పర్యటనకు వెళ్తే పుతిన్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
Modi-Biden telephonic call: రెండేళ్ల నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. సంక్షోభాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మరోసారి ప్రధాని పునరుద్ఘాటించారు.
Russia: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్మీలో సహాయక సిబ్బందిగా రిక్రూట్ అయిన భారతీయులను తిరిగి సొంత దేశాని పంపాలని భారత్ చేసిన విజ్ఞప్తిని రష్యా పరిగణలోకి తీసుకుంది.