BRICS Summit: పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు..
- రష్యాలో 16వ బ్రిక్స్ సమ్మిట్..
- పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ..
- ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ..
- శాంతి కోసం భారత్ సహకరిస్తుందన్న మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRICS Summit: 16వ బ్రిక్స్ సమావేశం కోసం ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు రష్యాకు వెళ్లారు. రష్యాలోని కజాన్‌లో సమావేశం జరగుతుంది. రష్యాకి చేరిన ప్రధాని మోడీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఇదిలా ఉంటే, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు. ఈ రోజు బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు ఒకరినొకరు కౌగిలించుకుని, పలకరించుకున్నారు. మరిన్ని దేశాలు బ్రిక్స్‌లో చేరుతున్న సమయంలో, ఈ సదస్సు విజయవంతం కావాలని ప్రధానిమోడీ అభినందనలు తెలిపారు.
Read Also: Bulldozer Action: బహ్రైచ్ నిందితులపై బుల్డోజర్ యాక్షన్.. యోగి సర్కార్‌కి సుప్రీంకోర్టు వార్నింగ్..
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
ఇరువురు నేతల భేటీలో ఉక్రెయిన్ యుద్ధంపై శాంతియుత పరిష్కారం గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ‘‘రష్యా-ఉక్రెయిన్ సమస్యలో మేము అన్ని వర్గాలతో టచ్‌లో ఉన్నాము. అన్ని వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలనేది మా వైఖరి. వివాదాలకు శాంతియుత పరిష్కారాలు ఉండాలని మేము విశ్వసిస్తున్నాము. శాంతిని నెలకొల్పడానికి సహాయం చేయడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది’’ అని ప్రధాని మోడీ అన్నారు.
ఈ సమావేశంలో ‘‘కజాన్ డిక్లరేషన్’’ ఉండబోతోంది. బ్రిక్స్‌లోని సభ్యులు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా నేతలు ఈ సమయంలో కలుసుకోనున్నారు. ఈ ఏడాది మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ రెండోసారి రష్యాకు వెళ్లారు. జూలై నెలోల 22వ భారత్-రష్యా వార్షిక సదస్సుకు హాజరయ్యారు. ఇరువురు నేతలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్రమోడీకి క్రెమ్లిన్‌లో రష్యా అత్యున్నత పౌర పురస్కారం ‘‘ ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’’ పురస్కారంతో సత్కరించింది.
#WATCH | Russia: Prime Minister Narendra Modi meets and holds a bilateral meeting with Russian President Vladimir Putin, in Kazan on the sidelines of the 16th BRICS Summit.
(Source: Host Broadcaster) pic.twitter.com/FARmZH7T0U
— ANI (@ANI) October 22, 2024
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!