తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి ప్రాణదాన ట్రస్టుకు ఆన్‌లైన్‌లో విరాళాల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇందులో భాగంగా రూ.కోటి విరాళాలు అందించిన భక్తులకు టీటీడీ ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు కేటాయిస్తోంది. శుక్రవారం రోజు ఈ సేవ పొందాలంటే రూ.1.5 కోట్లు విరాళంగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు బుధవారం 531 టిక్కెట్లను టీటీడీ అధికారులు అందుబాటులో ఉంచగా.. ఇప్పటివరకు రూ.82 కోట్ల విరాళాలకు సంబంధించి 68 టిక్కెట్లను మాత్రమే భక్తులు పొందారు. ఇందులో శుక్రవారం టిక్కెట్లు 28…
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి సేవలో తరించేందుకు మరోసారి టీటీడీ అవకాశం కల్పించింది. ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవల టికెట్ ధర నిర్ణయిస్తూ టీటీడీ ప్రకటన చేసింది. సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.కోటి ఉండగా.. శుక్రవారం నాడు మాత్రం రూ.కోటిన్నరగా నిర్ణయించింది. ఈ టికెట్‌పై 6గురు స్వామి వారి సేవలో పాల్గొనవచ్చు. జనవరి రెండో వారం నుంచి 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను అందుబాటులో ఉంచనుంది. అయితే ఈ టికెట్ల ద్వార రూ.600…