యూపీలోని ఎటాలో జరిగిన దాడిలో సాక్షిగా తీసుకొచ్చిన నడివయస్కుడ్ని రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. సోమవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. ఈ క్రమంలో.. కొత్వాలి ఇన్‌చార్జి నిధౌలీ కలాన్, మున్షీలను ఎస్‌ఎస్పీ సస్పెండ్ చేశారు. విచారణకు కూడా ఆదేశించారు. ఎండ వేడిమి కారణంగా మృతి చెందినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన నిధౌలి కలాన్ పోలీస్ స్టేషన్‌లోని జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ఉండూరు బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు హైవే పెట్రోలింగ్ పోలీసులపైకి దూసుకెళ్లింది లారీ. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మెండి సత్యనారాయణ, హోమ్ గార్డు ఎన్. ఎస్. రెడ్డి అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుండి వస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ వెహికిల్ కు ఎస్కార్ట్ గా వెళ్లేందుకు బ్రిడ్జి వద్ద ఇద్దరు హైవే పెట్రోలింగ్ పోలీసులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి రెండు…