Blast In Factory: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియాలోని ఎఫ్6 సెక్షన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇందులో దాదాపు పది మంది ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పాటు ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఘటన తర్వాత గందరగోళ వాతావరణం నెలకొనగా, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఖమారియా ఆసుపత్రిలో చేర్చగా.. ఫ్యాక్టరీ యాజమాన్యం వారిని చూసుకొంటోంది. ఎఫ్-6 సెక్షన్‌లోని భవనం నంబర్ 200లో పేలుడు సంభవించింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియా జనరల్ మేనేజర్, ఇతర అధికారులు కూడా సంఘటన స్థలంలో ఉన్నారు. కానీ వారు ఇంకా మీడియాతో సమాచారాన్ని పంచుకోవడం లేదు. గాయపడిన వారిని పరామర్శించేందుకు కాంట్ అసెంబ్లీ ఎమ్మెల్యే అశోక్ రోహని కూడా ఆస్పత్రికి వచ్చారు.
Read Also: Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్.. 83 వేల ఫోన్ 43 వేలకే! బ్యాంకు ఆఫర్స్ అదనం
జబల్‌పూర్‌లోని సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్ ఆర్డినెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఖమారియాలో మంగళవారం ఉదయం ఈ భారీ పేలుడు సంభవించింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు మరణించగా, దాదాపు డజను మంది ఉద్యోగులకు కాలిన గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వారిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. బాంబు నింపే సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఫ్యాక్టరీలోని ఎఫ్-6 విభాగంలో బాంబు నింపే పని జరుగుతుండగా.. ఒక్కసారిగా హైడ్రాలిక్ సిస్టమ్ పేలింది. పేలుడు శబ్దం చాలా పెద్దగా వినపడింది. దాని శబ్దం ఐదు కిలోమీటర్ల వరకు వినబడింది. ఘటనానంతరం, గాయపడిన ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. అక్కడ తీవ్రంగా గాయపడిన రణధీర్, శ్యామ్‌లాల్, చందన్ లను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక పేలుడు ఎలా జరిగింది? ఎవరి నిర్లక్ష్యమే కారణమన్న దానిపై విచారణ కొనసాగుతుంది.
Read Also: Fake Court: ఇదేందయ్యా ఇది.. ఫేక్ కోర్ట్, ఫేక్ జడ్జి
#WATCH | Madhya Pradesh: A blast occurred at the filling section in Ordnance Factory Khamaria at Jabalpur. Around 8 injuries reported. Details awaited.
Visuals from the hospital where two of the injured people have been rushed to. pic.twitter.com/AnEVqCRJsJ
— ANI (@ANI) October 22, 2024