మెగా డాటర్ నిహారిక పెళ్లి తరువాత సినిమాలకు స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. తన భర్త చైతన్య జొన్నలగడ్డకు నటించడం ఇష్టంలేదని తెలపడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన నిహారిక నిర్మాతగా మారింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో నిహా ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసింది. ఈ బ్యానర్ లోనే “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ” వెబ్ సిరీస్ ని తెరకెక్కించింది. జీ5 లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తనకు నచ్చిన విషయం కానీ, నచ్చని విషయం ఏదైనా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటాడు. తాజాగా ‘ట్రిపుల్ ఆర్’ సాంగ్ గురించి నిఖిల్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ‘ట్రిపుల్ ఆర్’ నుంచి నిన్న ‘జననీ’ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సాంగ్ గురించి ఆయన ట్వీట్…
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కొవిడ్ 19 బారిన పడ్డారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. అంతేకాదు ‘కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉందని, దానితో జాగ్రత్తగా ఉండాల’ని కమల్ హాసన్ సూచించారు. సోమవారం మధ్యాహ్యం కమల్ హాసన్ తాను హస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయాన్ని స్వయంగా ట్వీట్ చేశారు. ‘యూ.ఎస్. ట్రిప్ నుండి తిరిగి వచ్చాక కాస్తంత దగ్గు వచ్చిందని, పరీక్షలు నిర్వహించగా ఇన్ ఫెక్షన్ ఉందని వైద్యులు నిర్థారించారని అన్నారు.…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదం ఎక్కడ ఉంటె అక్కడ నేను ఉన్నాను అంటూ గుర్తుచేస్తాడు. ఈరోజు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటన ఇరు రాష్ట్రాలలోను సంచలనంగా మారింది. ఇక తాజాగా ఈ ఘటనపై ఆర్జీవీ తనదైన రీతిలో స్పందించాడు. చంద్రబాబు ఏడుస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ తన సినిమా ట్రైలర్ రియాక్షన్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈరోజు పవర్ స్టార్/ ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ విడుదల అయినా…
ప్రకాశ్ రాజ్ వారం పాటు మౌనవ్రతం లో ఉండబోతున్నారు. ఇదేదో ఆయన ఎవరిమీదో నిరసనతో చేస్తున్నది మాత్రం కాదు! ఇటీవల కొంత అనారోగ్యానికి గురైన ప్రకాశ్ రాజ్ ఎందుకైనా మంచిదని కంప్లీట్ బాడీ చెకప్ చేయించారట. అంతా బాగుందని డాక్టర్లు చెప్పారట. అయితే వోకల్ కార్డ్స్ కు వారం పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి ఇవ్వమని వైద్యులు సలహా ఇచ్చారట. అందుకోసమే ‘మౌనవ్రతం’ పాటించబోతున్నానని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రతి విషయం మీద తన స్పందనను…
బాలీవుడ్ భామ స్వరా భాస్కర్ కి వివాదాలు కొత్త కాదు.. నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం.. వాటిని నెటిజన్స్ ట్రోల్స్ చేయడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఇక తాజాగా మరోసారి అమ్మడిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇటీవల స్వరా భాస్కర్ ఈ మధ్యే ఓ మైక్రో బ్లాగింగ్‌ను మొదలుపెట్టింది. అందులో మొదటిసారిగా ఆమె చీరలో ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఇక…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెందిన 12 రోజులు అవుతుంది. గుండెపోటుతో ఆయన మరణించడం కన్నడిగులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. టాలీవుడ్ కోలీవుడ్ అని లేకుండా చిత్ర పరిశ్రమ అంతా పంత్ కి నివాళులు అర్పించారు. కొంతమంది పంత్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించగా.. మరికొంతమంది ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ట్విట్టర్ ద్వారా పునీత్ కి సంతాపం తెలిపారు. “పునీత్.. నీ మరణాన్ని నేను…
టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకొని బిజీగా మారింది శృతి హాసన్ . ఇప్పటికే సాలార్ షూటింగ్ లో బిజీగా ఉన్న అమ్మడు ఇటీవలే బాలయ్యతో బంపర్ ఆఫర్ పట్టేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శృతిహాసన్ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని గోపీచంద్ మలినేని అధికారికంగా ప్రకటించారు. ఇక ఆ చిత్రంలో హీరోయిన్ ని ప్రకటించిన ఐదు రోజుల తర్వాత శృతి హాసన్ దీనిపై ట్విట్టర్ లో స్పందించారు. స్పందించడం…
విభిన్న కథాంశాలతో వరుస విజయాలను అందుకుంటున్న హీరో శ్రీవిష్ణు. ఇటీవలే రాజరాజ చోర చిత్రంతో విజయాన్ని అందుకున్న శ్రీ విష్ణు మరోసారి అర్జున ఫల్గుణ అనే కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ…
ఆనంద్ మహీంద్రా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. ప్రతి చిన్న విషయంపై స్పందిస్తారు. కొన్ని ఫోటోలు చూసి ఆయన పెట్టే పోస్టులు కూడా చాలా కొత్తగా, ఆలోచింప చేసే విధంగా ఉంటాయి. ఆయనకున్న ఫాలోయింగ్‌తో అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వ్యాపార వేత్త కావడంతో ఆయన ఆలోచనలు, సోషల్ మీడియాలో చేసే పోస్టులు కూడా అదేవిధంగా ఉంటాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అనురాగ్ చిరిమార్ కి అమితాబ్ బచ్చన్ అంటే ఎంతో ఇష్టం.…