విభిన్న కథాంశాలతో వరుస విజయాలను అందుకుంటున్న హీరో శ్రీవిష్ణు. ఇటీవలే రాజరాజ చోర చిత్రంతో విజయాన్ని అందుకున్న శ్రీ విష్ణు మరోసారి అర్జున ఫల్గుణ అనే కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా ఈ మూవీ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఇక ఈ టీజర్ చూసి రానా దగ్గుబాటి ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. “అదిరిపోయిందిగా.. న్యూ వెరైటీకి సెల్యూట్’ అంటూ శ్రీ విష్ణును పొగిడేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన అమ్రిత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Adiripoyindhi ga….🔥🔥🔥 new variety ki salute 💥💥💥 https://t.co/Gmhgsa2lTB
— Rana Daggubati (@RanaDaggubati) November 9, 2021