కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెందిన 12 రోజులు అవుతుంది. గుండెపోటుతో ఆయన మరణించడం కన్నడిగులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. టాలీవుడ్ కోలీవుడ్ అని లేకుండా చిత్ర పరిశ్రమ అంతా పంత్ కి నివాళులు అర్పించారు. కొంతమంది పంత్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించగా.. మరికొంతమంది ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ట్విట్టర్ ద్వారా పునీత్ కి సంతాపం తెలిపారు. “పునీత్.. నీ మరణాన్ని నేను ఇంకా జీర్నచుకోలేకపోతున్నాను.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను నాన్నా” అంటూ పునీత్ తో పాటు కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇక ఈ ట్వీట్ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
పునీత్ చనిపోయిన 12 రోజుల తర్వాత మీరిప్పుడు స్పందిస్తున్నారా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా ఆ ట్వీట్ ని తన కూతురు, సినీ దర్శకురాలు సౌందర్య కొత్తగా ప్రారంభించిన హూట్ అనే యాప్ ద్వారా సంతాపం తెలిపారు. దీంతో పునీత్ అభిమానులు మండిపడుతున్నారు. “కన్నింగ్ ఫెల్లో.. సిగ్గుగా ఉంది నిన్ను చూస్తుంటే.. నీ కూతురు యాప్ ని ప్రమోట్ చేయడానికి ఇంత నీచానికి దిగజారారు అంటే నమ్మలేకున్నా.. యాప్ ప్రమోషన్ కోసం పునీత్ మరణాన్ని అడ్డుపెట్టుకుంటారా..?” అని అని కొందరు.. “100% వ్యాపారిగా మారిన రజినీకాంత్” అని మరికొందరు.. “ఒక లెజెండ్ అయ్యి ఉండి మీరు కూడా ఇలాంటి పనులు చేస్తారని అనుకోలేదని” మరో నెటిజన్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారింది.
நீ இல்லை என்பதை என்னால் ஏற்றுக் கொள்ள முடியவில்லை புனீத்…
— Rajinikanth (@rajinikanth) November 10, 2021
Rest in peace my child https://t.co/ebAa5NhJvj