తమిళ స్టార్ హీరో విజయ్ పై ఆయన మాజీ PRO షాకింగ్ కామెంట్స్ చేసారు. విజయ్ కి కనీస మర్యాద కూడా ఉండదని అన్నారు. అసలు వీరిద్దరి విషయంలో అసలేం జరిగిందంటే… తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా SS రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి సంచలన విజయం సాధించిన తర్వాత తమిళ పరిశ్రమ కూడా అలాంటి సినిమా తీయాలని భావించింది. ఈ నేపధ్యంలో కత్తి వంటి సూపర్ హిట్ చేసిన విజయ్ బాహుబలి లాంటి…
TVK Chief Vijay: ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్), జయలలిత తరహాలోనే.. తన సినీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాడు. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. అయితే, శివాజీ గణేషన్, విజయకాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు తమ ప్రజాదరణను ఎన్నికల విజయంగా మార్చుకోలేకపోయినా, విజయ్ దళపతి మాత్రం ఈ పరంపరను…
తమిళ స్టార్ హీరో నటిస్తున్న చివరి సినిమా జననాయగాన్. విజయ్ కెరీర్ లో 69వ గా రాబోతున్నఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రేమలు బ్యూటీ మమతా బైజు విజయ్ కు కూతురిగా నటిస్తోంది. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ పై…
ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలో బీజేపీ, ఏఐఏడీఎంకేలతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నారు. ఇక, ముఖ్యమంత్రి అభ్యర్థి ఏఐఏడీఎంకే నుంచి ఉంటారని స్పష్టం చేశారు. కాగా, పార్టీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) పేరును అమిత్ షా ప్రస్తావించలేదు.
Tamil Nadu: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ సారి అధికార డీఎంకే, అన్నాడీఎంకే, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే) మధ్య ముక్కోణపు పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరుతుందనే వాదనలు తమిళనాట జోరుగా వినిపిస్తున్నాయి.
MRK Panneerselvam: తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ పై డీఎంకే మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం విమర్శలు గుప్పించారు. గతంలో విజయ్ బ్లాక్ టిక్కెట్లు అమ్మిన వ్యక్తి ఇప్పుడు అవినీతి గురించి ప్రసంగాలు ఇస్తున్నాడు అని మండిపడ్డారు.
Tamil Nadu: వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. అధికార డీఎంకేతో పాటు తమిళ స్టార్ విజయ్ పార్టీ టీవీకే, బీజేపీ, అన్నాడీఎంకేలు తమ తమ ప్రచార వ్యూహాలకు పదును పెట్టాయి. ఇదిలా ఉంటే, తమిళ ప్రజలు ఎవరిని సీఎంగా ఇష్టపడుతున్నారనే దానిపై సర్వే జరిగింది. సీఓటర్ సర్వే తమిళ ప్రజల మనోభావాలను ప్రతిబింబించింది.
టీవీకే పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్‌పై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ వర్క్ ఫ్రమ్ హోం పాలిటిక్స్ చేస్తున్నాడని ఆరోపించారు. స్కూల్ పిల్లలు లాగా ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.
తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే... కేంద్రంపై పోరాటానికి రెడీ అవుతోంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, త్రిభాషా విధానంపై పోరాటం చేసేందుకు డీఎంకే స్పీడ్ పెంచింది. మార్చి 12న తమిళనాడు వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టినట్లు డీఎంకే ప్రకటించింది.
Annamalai: తమిళనాడులో ‘‘త్రి భాషా విధానం’’పై కేంద్రం, డీఎంకే ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. కేంద్రం తమపై బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందని సీఎం స్టాలిన్‌తో పాటు డీఎంకే పార్టీ ఆరోపిస్తోంది. జాతీయ విద్యావిధానంలో భాగంగా హిందీని బలవంతంగా ప్రయోగిస్తు్న్నారంటూ తమిళ పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా, హిందీపై నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై విమర్శలు గుప్పించారు.