ఇవాళ (నవంబర్ 23న) కాంచీపురం జిల్లాలో 2 వేల మంది పార్టీ కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించనున్నారు. దీనికి పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేపట్టారు. ఈ సమావేశానికి భద్రతకు సంబంధించి ఇప్పటికే పార్టీకి కార్యకర్తలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు.
Karur stampede: తమిళ స్టార్ యాక్టర్, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ నిర్వహించిన కరూర్ ర్యాలీ విషాదంగా మారిన సంగతి తెలిసిందే. తొక్కసలాట జరిగి ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ సంఘటనపై ప్రాథమిక వివరాలు కోరడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.
తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇటీవల కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మృతి చెందారు. కాగా దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని టీవీఏ పార్టీ వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. Also Read:Delhi: విదేశీ కోచ్‌లపై వీధికుక్కల దాడి.. ఇది దేశ ప్రతిష్టకు మచ్చ-బీజేపీ లీడర్ పోలీసులు లాఠీచార్జీ చేయడంతోనే తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు టీవీకే ఆరోపించింది. అయితే ఆ ఆరోపణలను తమిళనాడు…
బీజేపీపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనను బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందంటూ ఫైరయ్యారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కరూర్ ఘటనను బీజేపీ వాడుకుంటోంది తప్ప.. తొక్కిసలాట గురించి మాత్రం ఆందోళన లేదని వ్యాఖ్యానించారు.
Karur Stampede: కరూర్ విజయ్ సభ తొక్కిసలాట ఘటనలో హృదయ విదారక విషయాలు బయటకొస్తున్నాయి. తొక్కిసలాట, తోపులాట చాలా తీవ్రంగా జరిగినట్లు వైద్యుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగానే మరణాలు పెరిగాయనే అంచనాకు వచ్చారు. తమిళనాడు వైద్యవిద్య, పరిశోధన విభాగ డైరెక్టర్ ఆర్.సుగంధి రాజకుమారి నేతృత్వంలో ప్రత్యేక బృందం కరూర్‌ను సందర్శించింది. మృతులు, చికిత్స పొందుతున్న పేషెంట్లకు అందిన వైద్యం, వారి పరిస్థితి దగ్గరుండి చూసింది. కేస్‌షీట్లు, వైద్యుల నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో పలు కీలక…
తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రచార సభ సమయంలో టీవీకే పార్టీనే పవర్ కట్ చేయమందని తమిళనాడు విద్యుత్తు బోర్డు అంటోంది. తమ పార్టీ అధినేత విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా ఆపేయాలని టీవీకే వినతిపత్రం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తమకు లేఖ ఇచ్చినట్లుగా విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి ధ్రువీకరించారు. తాత్కాలికంగా…
తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని నీలాంగరైలోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ ఆఫీసుకు గుర్తుతెలియని వ్యక్తులు ఈ–మెయిల్ చేశారు. వెంటనే అప్రమత్తమై పోలీసులు విజయ్ ఇంట్లో తనిఖీలు చేశారు. బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. అయితే ఇంట్లో పేలుడు పదార్థాలు ఏమీ లభించలేదు. దాంతో విజయ్ కుటుంబసభ్యులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కేసు నమోదు…
TVK Rally Stampede: తమిళ స్టార్ ,టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. కరూర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాజకీయం విమర్శలు ప్రతివిమర్శలకు కారణమవుతోంది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. విజయ్ ర్యాలీలో విద్యుత్ అంతరాయం, అకాస్మత్తుగా జనసమూహం, ఇరుకైన స్థలం కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
తమిళ సినీ సూపర్‌స్టార్, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు తలపతి విజయ్‌పై, ఆయన బౌన్సర్లపై కున్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మదురైలో ఇటీవల జరిగిన టీవీకే భారీ బహిరంగ సభలో శరత్ కుమార్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో గాయాలై నట్లు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. 2026 తమిళనాడు ఎన్నికలకు ముందు విజయ్ తన రాజకీయ భావజాలాన్ని వివరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభకి లక్షలాది మంది అభిమానులు, మద్దతుదారులు…