ప్రముఖ దర్శక నిర్మాత రామానంద్ సాగర్ రూపొందించిన బుల్లితెర ధారావాహిక ‘రామాయణ్’ను ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. అందులో కీలక పాత్రలు పోషించిన పలువురు నటీనటులు ఆ తర్వాత రాజకీయ జీవితంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఈ సీరియల్ లో రావణాసురుడి పాత్రకు ప్రాణం పోసిన అరవింద్ త్రివేది (82) మంగళవారం రాత్రి ముంబైలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన మేనల్లుడు కౌస్తభ్ త్రివేది తెలియచేస్తూ, ‘కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ముందు గుండెపోటుకు గురయ్యారు,…