ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. హాజరుకానున్న కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల సీఎంలు. కుల గణనపై చర్చ, తదుపరి కార్యాచరణ ఖరారు చేయనున్న CWC. ఇవాళ ఉదయం 10 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్న టీకాంగ్రెస్ బీసీ నేతలు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ధన్యవాదాలు తెలపనున్న నేతలు. నేడు అమరావతి పునర్‌నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన. ప్రధాని మోడీ సభకు 5లక్షల మంది…
Tummala Nageswara Rao : ఖమ్మం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సన్నర కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి పలు కీలక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించారని, 4,400 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం…
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న సన్నబియ్యం పంపిణీ పేదల కడుపు నింపుతోంది. ఇన్నాళ్లు దొడ్డు బియ్యం అన్నం తినలేక ఇబ్బంది పడిన వారు ఇప్పుడు రేవంత్ సర్కార్ సన్న బియ్యం అందిస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు స్వయంగ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి భోజనం చేస్తున్నారు. ఈ క్రమంలో రఘునాథాపలెం మండలం బూడిదేం పాడులో గుడిబండ్ల రాజారావు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును భోజనానికి ఆహ్వానించారు. గుడిబండ్ల రాజారావు దంపతులు సన్నబియ్యంతో భోజనం వడ్డించారు. సన్నబియ్యంతో భోజనం…
Tummala Nageswara Rao : రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతన్న, నేతన్నలే అగ్ర ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం సంకల్పంతో పని చేస్తోందని, రైతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం తాకినప్పటికీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అభివృద్ధి…
ఆవులు ఆవులు పొడుచుకుంటే…. మధ్యలో దూడలు నలిగిపోయినట్టుగా అక్కడి రాజకీయం మారిందా? రాష్ట్ర స్థాయి హయ్యెస్ట్ పోస్టుల్లో ఉన్న ఆ ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అనడం సెగలు పుట్టిస్తోందా? ఎవరికి వారు ప్రోటోకాల్‌తో కొట్టే ప్రయత్నం చేయడం రక్తి కట్టిస్తోందా? ఎవరా ఇద్దరు? ఏంటా పోటీ రాజకీయం? జాతీయ ఉపాధి హామీ పనుల ప్రొసీడింగ్స్ రద్దు వ్యవహారం… నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య అగ్గి రాజేసిందట. ఈ విషయంలో పరస్పరం…
అకాల వర్షాలు, వడగళ్లతో పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పంటలకు జరిగిన నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి, ప్రాథమిక నివేదికను వెంటనే అందించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. మార్కెట్లకు చేరుకున్న పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని మంత్రి తెలిపారు. వర్షం కారణంగా పంట నష్టపోవకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు. అలాగే, ఇప్పటికే కొనుగోలు చేసిన…
ప్రజావసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు…. హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్) రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజధాని నగరంతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం, విస్తరణపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం,…
Uttam Kumar Reddy : సీతారామ ప్రాజెక్ట్ మిగిలిన పనులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భేటీ అయ్యారు. సత్తుపల్లి ట్రంక్ పనులు జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించారు. సీతమ్మ సాగర్ బ్యారేజి నిర్మాణం పూర్తి చేస్తే జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తుమ్మల నాగేశ్వర రావు కోరారు. ఈ సమావేశంలో సత్తుపల్లి ట్రంక్, సీతారామ ప్రాజెక్ట్…
Tummala Nageswara Rao : రాష్ట్రంలో యూరియా కొరతలేదని, రైతుల ఆందోళనకు గురికావద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. వ్యవసాయాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఈ వారంలో రాష్ట్రానికి మరో 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని తెలిపారు. గత యాసంగిలో రైతులు ఫిబ్రవరి 20 నాటికి 6.9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేయగా, ఈ సారి 8.80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని, గత సంవత్సరం ఫిబ్రవరిలో 1.99 లక్షల…
ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో నగర మేయర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లాఠీ దెబ్బలకు భయపడకుండా కాంగ్రెస్ కోసం కార్యకర్తలు పనిచేశారు.. కార్యకర్తలు కూడా అధికారాన్ని అనుభవించాలని అన్నారు.