Minister Thummala: తెలంగాణలో ఖమ్మం జిల్లాతో సహా పలు ప్రాంతాల్లో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Mulugu: నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు, పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే గత రాత్రి వాజేడు మండల కేంద్రంలో కురిసిన వర్షం వల్ల ముందుగా ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాల ప్రాంగణం సభకు పనికి రాకుండా పోవడంతో, చెక్కుల పంపిణీ సభను ఐటీఐ కళాశాల వద్దకు మార్చారు. ఈ కార్యక్రమంలో గత సంవత్సరం మొక్కజొన్న పంటలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులను…
Prakash Reddy: హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రాష్ట్రంలో ఎరువుల కొరత లేదన్నారు. ఇక రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రికి ఏ పంటకు ఏ ఎరువులు వాడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎరువులపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. కేంద్రప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో 268 అమ్మాల్సిన ఎరువుల…
దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లికించదగ్గ రోజు, ఈరోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 70 లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లో రూ. తొమ్మిది వేల కోట్లు వారి ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. రైతు భరోసా విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన మహాను భావుడు రాజీవ్ గాంధీ అన్నారు. వ్యవసాయం అంటే కాంగ్రెస్... కాంగ్రెస్ అంటే వ్యవసాయమని తెలిపారు. రైతులకు మద్దతు ధర ఇచ్చింది…
రైతు భారోసా నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. నాలుగు ఎకరాల వరకు రైతుభరోసా నిధులు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రైతుభరోసా కోసం మరో రూ.1313.53 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. మరో వారంలోగా పూర్తిగా రైతుభరోసా నిధుల జమ చేస్తామని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదని విమర్శించారు.
Rythu Nestham : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుల కోసం రూపొందించిన ‘రైతునేస్తం’ కార్యక్రమం సోమవారం (జూన్ 17) ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు వేదికల తయారీ, సాంకేతిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లకు మంత్రి ప్రత్యేక ఆదేశాలు…
Tummala Nageswara Rao : వ్యవసాయ రంగాన్ని కేంద్రంగా చేసుకుని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు రైతుల ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచాయి. ప్రస్తుతంగా రైతుల అవసరాలపై, పథకాల అమలుపై ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశీలనకు వస్తే, ప్రభుత్వం రైతుకు తోడుగా నిలుస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. రైతుల రుణ భారం తగ్గించేందుకు పాత రుణాల మాఫీ పూర్తయ్యిందని మంత్రి తెలిపారు. “రైతు బంధు పేరుతో గతంలో అన్ని పథకాలు ఆపేశారు. కానీ…
Tummala Nageswara Rao : రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న రైతుబంధు రూ. 7600 కోట్లు చెల్లించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ ఇచ్చే స్థితిలో కూడా లేని పరిస్థితి నుంచి, ఇప్పుడు రైతులకు అన్ని వనరులు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని, అధికారులను అక్కడికే…
NEET : జూన్ 15న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటించింది. ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో పరీక్షను ఒక్కే షిఫ్ట్లో నిర్వహించాల్సి ఉండటంతో, తగిన మౌలిక సదుపాయాలు, పరీక్షా కేంద్రాల ఏర్పాటులో సమయాభావం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు NBEMS పేర్కొంది. త్వరలోనే పరీక్ష కోసం కొత్త తేదీని ప్రకటించనున్నట్లు వెల్లడించింది. Chennai Love Story : కిరణ్…
CM Revanth Reddy: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో పంటలకు భారీ నష్టం సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించిన సుమారు 5,528 ఎకరాల పంటలు వర్షాల కారణంగా నష్టపోయాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రూ.51.528 కోట్ల…