సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న సన్నబియ్యం పంపిణీ పేదల కడుపు నింపుతోంది. ఇన్నాళ్లు దొడ్డు బియ్యం అన్నం తినలేక ఇబ్బంది పడిన వారు ఇప్పుడు రేవంత్ సర్కార్ సన్న బియ్యం అందిస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు స్వయంగ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి భోజనం చేస్తున్నారు. ఈ క్రమంలో రఘునాథాపలెం మండలం బూడిదేం పాడులో గుడిబండ్ల రాజారావు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును భోజనానికి ఆహ్వానించారు. గుడిబండ్ల రాజారావు దంపతులు సన్నబియ్యంతో భోజనం వడ్డించారు. సన్నబియ్యంతో భోజనం పెట్టిన దంపతులకు.. నూతన వస్త్రాలు పెట్టారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళిత నిరుపేదలు వారి ఇంట్లో కడుపునిండా భోజనం పెట్టారు.. ఇంటిల్లిపాది సన్నబియ్యంతో కడుపునిండా భోజనం చేస్తున్నామని సంతోషంగా చెప్పారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.. దొడ్డుబియ్యంతో చాలా ఇబ్బంది పడ్డామని చెప్పారు.. సన్నబియ్యంకు బోనస్ ఇచ్చి మరీ కొని ఇపుడు తిరిగి వారికే ఇస్తున్నాం.. పేదలకు ప్రజలకు ఆహార భద్రత.. రైతుకు గిట్టుబాటు ధర..
దేశంలోనే పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం.. మొన్నటి వరకు సంపాదన మొత్తం తిండికే ఖర్చు అయ్యే పరిస్థితి ఉండేది.. పేదల నోట్లో మన్నుకొట్టి ఇన్నాళ్లు దళారులు దోచుకున్నారు.. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఆఖరు లబ్ధిదారుడి వరకూ సన్నబియ్యం అందేలా చూడాలి.. ప్రజలు కూడా ఈ పథకాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు.