తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐ (సివిల్, ఐటీ అండ్ సీఓ, పీటీఓ) తత్సమాన పోస్టులు, ఏఎస్‌ఐ పోస్టుల రాత పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని విడుదల చేసినట్లు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు.
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రిలిమినరీ పరీక్షలు ముగియగా.. ప్రస్తుతం ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది.
తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో కీలకమైన ఈవెంట్స్ ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతున్నాయి.. అయితే, అభ్యర్థులకు కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి.. అడ్మిట్ కార్డులో పేర్కొన్న సమయానికి.. సంబంధిత సెంటర్‌కు వెళ్లకుంటే.. అభ్యర్థిత్యం రద్దు చేయనున్నట్టు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఇప్పటికే ప్రకటించింది.. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక రాతపరీక్షలో అర్హులైన 2,37,862 మంది అభ్యర్థులకు ఇవాళ్టి నుంచి అంటే.. డిసెంబరు 8వ తేదీ నుంచి జనవరి తొలి వారం వరకూ ఫిజికల్…
తెలంగాణలో ఇవాళ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష జరగనుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించబోమని రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు అధికారులు. పరీక్ష ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుంది. ఉదయం పది గంటల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తామని తెలిపారు అధికారులు. పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, వాచీలు, క్యాలిక్యులేటర్ లాంటి ఎలక్ట్రానిక్…