తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తాసిల్దార్ పై కేసు నమోదైంది. వందల కోట్ల విలువైన 42 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్ కు విక్రయించినందుకు మహేశ్వరం మాజీ తాసిల్దార్ ఆర్.పీ జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్టర్, ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డిపై కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. వీడియో నెంబర్ 83/2023 కింద కేసు నమోదు అయింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నాగారం గ్రామంలోని సర్వేనెంబర్ 181లో 42 ఎకరాల ప్రభుత్వ భూమిని మహేశ్వరం మాజీ తాసిల్దార్ జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్, ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డికి అప్పనంగా అందజేశారు. ఈ విషయమై దస్తగిరి షరీప్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించగా XVII అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాల మేరకు మహేశ్వరం సీఐ మధుసూదన్ సెక్షన్ 420, 166 కింద తాసిల్దార్ జ్యోతి సబ్ రిజిస్టర్ ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.
Also Read : Revanth Reddy : ఇది హ్యాకింగా, హానీ ట్రాపా, లీకా తేల్చాలి
ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదుతో పాటు తెలంగాణ హైకోర్టు WP37146/2022 ద్వారా విచారణ కూడా కొనసాగుతుంది. ఇది ఇలా ఉండగా భూముల విషయమై సాక్షాత్తు తాసిల్దార్ పై కేసు నమోదు కావడం తెలంగాణలో ఇది మొట్టమొదటిసారి కావడం విశేషం. మహేశ్వరం పోలీసులు మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు. భూవివాదాలు కోర్టులో ఉన్నందు వల్ల తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తున్నారు. నాగారంలోని సర్వే నెంబర్ 181 విషయం తమ దృష్టికి వచ్చిందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని ప్రస్తుతం తాసిల్దార్ మహ్మద్ అలీ తెలిపారు.
Also Read : Umesh Pal Case: హత్య కేసులో మరో నిందితుడిని ఎన్‌కౌంటర్‌లో లేపేసిన యోగీ సర్కార్..