ఏళ్ల తరబడి సమస్యగా ఉన్న పోడు భూములకు పట్టాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే.. పోడు భూములకు పట్టాల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుండగా..పోడు భూముల క్రమబద్ధీకరణ చట్ట విరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
Errabelli Dayakar Rao : తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకే మూడు గ్రామ పంచాయతీలుగా భద్రాచలం వికేంద్రీకరణ జరుగుతుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. నిందితులు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌లకు బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.
తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్య మరింత పెరగనుంది.. రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఆరుగురు న్యాయవాదులను జడ్జీలుగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం.
తెలంగాణ హైకోర్టులో బార్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిగా హాజరయ్యారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.సమావేశంలో హైకోర్టు చీఫ్ జస్టీస్ సతీష్ చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ తెలంగాణ న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు తనకి సన్మానం చేయడం చాలా అనందంగా ఉందన్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే. ఎక్కడ…
ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సాము. రోడ్డుపై వాహనాలు నడిపేవారిని నిరంతరం గమనిస్తూ ట్రాఫిక్ ని నియంత్రించడం ఎంతో కష్టసాధ్యం. అందునా వీఐపీల తాకిడి ఎక్కువగా వుండే చోట మరింత కఠినంగా వుంటుంది. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డు పనితీరుకి ఉన్నతస్థాయిలో ప్రశంసలు లభించాయి. https://ntvtelugu.com/woman-gave-birth-to-a-child-by-ivf-after-husband-died/ వెల్ డన్ హోమ్ గార్డు ఆఫీసర్ అంటూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశంసించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్…
తెలంగాణలో ఏర్పడిన కొత్త జిల్లాలో త్వరలోనే జిల్లా జడ్జి కోర్టులు ఏర్పాటుచేస్తామని, దీనిపై హైకోర్ట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జి కోర్టులను సత్వరమే ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.…