వినాయక నిమజ్జనంపై తమకు వివరాలు సమర్పించాలని మరోసారి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిమజ్జనం సందర్భంగా జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారు… రసాయనాలతోకూడిన విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా చర్యలేమిటి అని ప్రశ్నించింది. ఇక సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక సమర్పించకపోతే సీనియర్ అధికారులు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. హుస్సేన్ సాగర్ లో గణేష్, దుర్గ విగ్రహాల…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదేశించింది హైకోర్టు.. సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు జరుగుతున్నట్టు తరచూ మా దృష్టికి వస్తున్నాయని పేర్కొన్న హైకోర్టు… 33 జిల్లాల్లో కలెక్టర్లు వెంటనే సర్వే పనులు చేపట్టి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని.. ప్రభుత్వ భూములను గుర్తించి, జియో సర్వే వివరాలతో రికార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం…
కరోనా మహమ్మారి కారణంగా కోర్టులు కూడా ఆన్‌లైన్ విచారణకే పరిమితం అయ్యాయి… కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష విచారణకు సిద్ధం అవుతోంది తెలంగాణ హైకోర్టు.. ఆగస్టు 9వ తేదీ నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది.. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ జరగనుండగా.. రోజూ ఒక ధర్మాసనం, ఒక సింగిల్ బెంచ్ ప్రత్యక్ష విచారణ జరుపుతుందని.. వ్యాక్సిన్ వేసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష…
తెలంగాణలో సినిమా థియేటర్లలో టిక్కెట్లు ధరల పై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేశారని ప్రశ్నించింది హైకోర్టు. అయితే టికెట్ల ధరలు నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు హైకోర్టు తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది. ఆ కమిటీ సూచనలు ప్రభుత్వానికి నివేదించినట్లు కోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరుపు న్యాయవాది. కమిటీ నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని హైకోర్టు పేర్కొంది. ఇక…
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ కోర్టులపై కూడా పడింది.. ఆన్‌లైన్ పిటిషన్లు మాత్రమే స్వీకరించడం.. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా విచారణ చేయడం లాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అయితే, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. క్రమంగా అన్ని తెరుచుకుంటున్నాయి.. ఈ తరునంలో.. కోర్టుల్లో అన్ లాక్ ప్రారంభించాలని నిర్ణయించింది హైకోర్టు.. సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది.. ఇప్పటి వరకు రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరవుతుండగా.. ఈనెల 19 నుంచి…
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్ వివాదాస్పద భూముల కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. హఫీజ్‌పేట్ భూములపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. భూములను యథాతథ స్థితిలో కొనసాగించాలని ఆదేశించింది.. కాగా, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లింది తెలంగాణ ప్రభుత్వం.. వారం రోజుల క్రితమే మరో స్పెషల్ లీవ్ పిటిషన్‌ని అనుమతిస్తూ సర్వే నెంబర్ 80లో సి కళ్యాణ్‌తో పాటు మరికొందరికి టైటిల్ లేదని.. లేని టైటిల్ భూమిలో ఎలా…