సుప్రీంకోర్టు కొలీజియం.. ఇవాళ కొందరు సీనియర్ జడ్జీలను దేశ అత్యున్నత న్యాయస్థానానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ఓ జాబితాను రూపొందించింది. దీన్ని తుది అనుమతుల కోసం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించింది. కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం యధాతథంగా ఆమోదిస్తుంది. అయితే, ఈ జాబితాలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కూడా ఉన్నారు.
TS Hig Court: ములుగు జిల్లాలోని ఆదివాసీల సుదీర్ఘ పోరాటం ఫలించింది. తెలంగాణ హైకోర్టు వారికి అనుకూలంగా సంచలన తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలేనని తెలిపింది.
తెలంగాణ హైకోర్టు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తెలుగులో తొలి తీర్పు వెలువరించడం ద్వారా చరిత్ర సృష్టించింది. సికింద్రాబాద్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు తొలిసారిగా తెలుగులో తీర్పు వెల్లడించింది.
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇప్పటికే చాలా పేపర్లు లీక్ అయిన తర్వాత కూడా అదే సిబ్బందితో పరీక్ష నిర్వహిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తీసుకుంటూనే ఉంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌కు సంబంధించి గురువారం కీలకం కానుంది. బెయిల్ పిటిషన్ విచారణను.. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తేల్చాలన్న అవినాష్ రెడ్డి అభ్యర్థనను.. సుప్రీంకోర్టు అంగీకరించడంతో, గురువారం హైకోర్టులో పిటిషన్ విచారణకు రానుంది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్…
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జిల్లా జడ్జీలను హైకోర్టు బదిలీ చేసింది. వార్షిక బదిలీల్లో భాగంగా పెద్ద సంఖ్యలో జిల్లా సెషన్స్ జడ్జీలను ట్రాన్స్ పర్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 41 మంది డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జీలను బదిలీ చేసింది.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేటి సీబీఐ విచారణ రేపటికి ( మంగళవారం ) వాయిదా పడింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
IAS, IPS Transfers : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల అంశంలో కేంద్రం తెలంగాణ హైకోర్టుకు సూచన చేసింది. ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని కోర్టును కేంద్రం కోరింది.