TS High Court: దుర్గం చెరువు పరిసర వాసులకు హైకోర్టు ఊరట.. కూల్చివేతలపై స్టే..
- తెలంగాణ హైకోర్టు హైడ్రాకు కీలక ఆదేశాలు జారీ..
- దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS High Court: తెలంగాణ హైకోర్టు హైడ్రాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు చుట్టుపక్కల నిర్వాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. ఈ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిశీలించాలని హైకోర్టు పేర్కొంది. దుర్గం సరస్సు ప్రాంత నిర్వాసితులు అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎదుట హాజరుకావాలని పేర్కొన్న కోర్టు.. అభ్యంతరాలను పరిశీలించి అక్టోబర్ 4 నుంచి ఆరు వారాల్లోగా తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామంతో దుర్గం చెరువు పరిసర వాసులకు ఊరట లభించింది. మరోవైపు హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆదివారం కూకట్‌పల్లిలోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌లోని బఫర్ జోన్‌లో నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా.. నేడు మాదాపూర్‌లో కూల్చివేతలను కొనసాగిస్తోంది. కావూరి హిల్స్ పార్క్‌లోని అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. పార్క్‌లోని స్పోర్ట్స్ అకాడమీపై కావేరి హిల్స్ అసోసియేషన్ గత కొంతకాలంగా ఫిర్యాదులు చేస్తోంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. ముందుగా స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగించారు. నిర్మాణాలను తొలగించిన అధికారులు కావేరి హిల్స్ పార్క్ అనే బోర్డును ఏర్పాటు చేశారు.
Kaleshwaram Commission: రేపటి నుంచి ఇంజనీర్లను ప్రశ్నించనున్న కాళేశ్వరం కమిషన్..
Also Read
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!