వ్యాక్సిన్ల కొరత రాష్ట్రాలను వెంటాడుతూనే ఉంది.. తెలంగాణలోనూ అదే పరిస్థితి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సర్కార్.. కోవాగ్జిన్ రెండో డోసు వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.. 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం నుంచి కోవాగ్జిన్ స్టాక్ రాలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ వ్యాక్సినేషన్ ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. కాగా, ఈ నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన అందిరికీ వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించినా.. వ్యాక్సిన్ల కొరతతో అది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు.. ఈ సమయంలో.. రెండో డోసులకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది సర్కార్. కానీ, ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత కారణంగా.. రెండో డోసు వ్యాక్సినేషన్‌ను కూడా నిలిపివేసింది. కాగా, ఇప్పటికే శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ నిలిపివేసిన సర్కార్.. ఇప్పుడు ఈ తాజా ప్రకటన చేసింది.