నిన్నామొన్నటి దాకా ఇరాన్‌ను పదే పదే అధ్యక్షుడు ట్రంప్ బెదిరిస్తూనే ఉన్నారు. నిరసనకారుల్ని చంపడం ఆపకపోతే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇస్తూ వచ్చిన ట్రంప్.. ఇప్పుడు స్వరం మారింది. తాజాగా ట్రంప్.. ఇరాన్‌కు ‘ధన్యవాదాలు’ చెప్పారు. ఇదేంటి? అంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అంతన్నారు.. ఇంతన్నారు.. ఇంతలో ఏమైంది? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: BMC Elections : ఠాక్రే సోదరుల కలయిక విఫలం.. ముంబై కోటను కోల్పోయిన వారసులు..
ప్రస్తుతం ఇరాన్‌పై ట్రంప్ వైఖరి మొత్తబడినట్లుగా కనిపిస్తోంది. వందలాది మంది నిరసనకారుల మరణశిక్షలను వాయిదా వేసినందుకు టెహ్రాన్‌కు బహిరంగంగా ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. కారణం ఏంటో తెలియదు గానీ అమెరికా వెనక్కి తగ్గింది. ట్రూత్ సోషల్ మీడియాలో ‘‘రేపు జరగాల్సిన అన్ని ఉరిశిక్షలను (800 కంటే ఎక్కువ) రద్దు చేసినందుకు ఇరాన్ నాయకత్వానికి నన్ను ఎంతో గౌరవిస్తోంది. ధన్యవాదాలు!.’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Off The Record: పశ్చిమ గోదావరిలో వైసీపీకి షాక్..!
ఇరాన్‌పై అమెరికా దాదాపు దాడికి సిద్ధమైంది. కానీ ఇంతలోనే మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్ దౌత్యంతో ట్రంప్ మెత్తబడినట్లుగా తెలుస్తోంది. ఇరాన్‌పై దాడి చేస్తే ఆ ప్రాంతమంతా తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని సౌదీ అరేబియా, ఖతార్ అధికారులు అమెరికాను హెచ్చరించినట్లుగా గల్ఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇరాన్‌లో తలెత్తిన ఆర్థిక సంక్షోభంగా కారణంగా ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత డిసెంబర్ 28 నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటి వరకు 3 వేల మంది చనిపోయారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌పై దాడి చేసేందుకు అమెరికా సిద్ధమైంది. మొత్తానికి దౌత్యం ఫలించడంతో ట్రంప్ మెత్తబడ్డారు.