ప్రధాని మోడీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. సుంకాల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత్‌తో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. భారత్-అమెరికా మధ్య సంబంధాలు చాలా ప్రత్యేకమైన సంబంధంగా అభివర్ణించారు. వాణిజ్యం విషయంలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని.. అందుకు తాను సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాబోయే వారాల్లో మంచి స్నేహితుడైన భారత ప్రధాని మోడీతో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రెండు దేశాల మధ్య విజయవంతమైన ముగింపు రావడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని కచ్చితంగా భావిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 5న కూడా మోడీ ఎల్లప్పుడూ స్నేహితుడిగా ఉంటారని చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రత్యేక సమయంలో ఏమి చేస్తున్నారో తనకు నచ్చడం లేదన్నారు. ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంలో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ కలిసి ఉండడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Off The Record: కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయితీకి తెర లేస్తోందా..? ఆ ఎమ్మెల్యేలకు తిప్పలు తప్పవా..?
ట్రంప్ మొదటి పరిపాలనలో మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక కొద్ది రోజులు మోడీ-ట్రంప్ మధ్య మంచి సంబంధాలే కొనసాగాయి. అయితే తొలుత భారత్‌పై ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. అనంతరం కొద్దిరోజులకే రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు బాంబ్ పేల్చారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. అంటే అన్ని దేశాల కంటే భారత్‌పైనే ఎక్కువ సుంకం విధించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక రష్యా దగ్గరే చమురు కొనుగోలు చేస్తామని భారత్ తేల్చి చెప్పింది. ఇక అన్నదాతల కోసం సుంకాలు ఎంతైనా భరిస్తామంటూ ప్రకటించారు.
