జాతీయవాది చార్లీ కిర్క్ హత్య తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యాంటీఫాను ‘ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించారు. చార్లీ కిర్క్‌ను హత్య చేసిన నిందితుడు యాంటీఫాకు చెందిన వాడిగా ఎఫ్‌బీఐ అనుమానించింది. ఈ నేపథ్యంలో యాంటీఫాను తీవ్రవాద సంస్థగా ట్రంప్ పేర్కొన్నారు.

అయితే చార్లీ కిర్క్‌ను హత్య చేసిన నిందితుడు టైలర్ రాబిన్సన్‌కు యాంటీఫా ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లుగా స్పష్టమైన ఆధారాలు మాత్రం చూపించలేకపోయారు. రాబిన్సన్.. లింగమార్పిడి కలిగిన వ్యక్తితో కలిసి ఉంటున్నాడు. అయితే రాబిన్సన్‌కు యాంటీఫాతో సంబంధాలు ఉన్నట్లుగా ఎఫ్‌బీఐ భావిస్తోంది. ఆ కారణంతోనే యాంటీఫాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్లుగా తెలుస్తోంది.

‘‘నేను యాంటీఫాను ఒక అనారోగ్య, ప్రమాదకరమైన, రాడికల్ లెఫ్ట్ డిజాస్టర్‌ను ఒక ప్రధాన ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తున్నాను. అనేక మంది యూఎస్ఏ పేట్రియాట్లకు తెలియజేయడానికి సంతోషంగా ఉంది. యాంటీఫాకు నిధులు సమకూర్చే వారిని అత్యున్నత చట్టపరమైన ప్రమాణాలు, పద్ధతులకు అనుగుణంగా క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి. ఇందుకోసం గట్టిగా సిఫార్సు చేస్తున్నా. ఈ విషయంపై మీ శ్రద్ధకు ధన్యవాదాలు.’’ అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
సెప్టెంబర్ 10న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ ప్రసంగిస్తుండగా 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ తుపాకీతో కాల్చి చంపాడు. నిందితుడు రాబిన్సన్ లింగమార్పిడి కలిగిన వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నాడు. ఇక సంఘటనాస్థలిలో బుల్లెట్ కేసింగ్‌లపై ఫాసిస్ట్ వ్యతిరేక నినాదాలు కనిపించాయి. అలాగే ఇటాలియన్ ప్రతిఘటన గీతం బెల్లా సియావో సూచనలు ఉన్నట్లుగా ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Murder : మామ ఆస్తి కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూపు.. చివరికి
అయితే నిందితుడు రాబిన్సన్ యాంటీఫాతో సంబంధం కలిగి ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే నిందితుడు చార్లీ కిర్క్‌ను హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ యాంటీఫాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. యాంటీఫాకు నిధులు సమకూర్చే వారిపై అత్యున్నత చట్టపరమైన ప్రమాణాలతో విచారిస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Sundarakanda : రొమాంటిక్ కామెడీ ‘సుందరకాండ’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
వాస్తవంగా యాంటీఫా అనేది అధికారిక సంస్థ కాదు. స్వయంప్రతిపత్తి కలిగిన స్థానిక సమూహాల ద్వారా ఏర్పడిన నెట్‌వర్క్. వీరంతా ఫాసిజం, మిలిటెంట్ ప్రత్యర్థులుగా అభివర్ణించుకుంటారు. 2017లో చార్లోట్స్‌విల్లేలో జరిగిన హింసాత్మక ఘటనతో యూఎస్ అంతటా నిరసనల్లో పాల్గొన్నారు. తీవ్రవాదుల నుంచి రక్షణ కోసమే తమ సంస్థ ఉందని యాంటీఫా వాదిస్తుంది.
