Modi-Trump: భారత్-అమెరికా మధ్య శుభపరిణామం.. త్వరలోనే వాణిజ్య చర్చలు
- భారత్-అమెరికా మధ్య శుభపరిణామం
- త్వరలోనే రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం వెలువడుతోంది. భారీగా సుంకం విధించడంతో ఇరు దేశాల మధ్య గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రంప్ కీలక పోస్ట్ చేశారు. భారత ప్రధాని మోడీ తనకు చాలా మంచి స్నేహితుడని.. మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెనువెంటనే మోడీ కూడా రిప్లై ఇచ్చారు. తాను కూడా ట్రంప్‌తో మాట్లాడేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించారు. రెండు దేశాల భాగస్వామ్యం చాలా గొప్పదిగా అభివర్ణించారు.
ఇది కూడా చదవండి: KP Sharma Oli: 24 గంటలుగా కనిపించని నేపాల్ మాజీ ప్రధాని ఓలి ఆచూకీ.. ఏదైనా జరిగిందా?
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ఈ పరిణామాల నేపథ్యంలో తిరిగి భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం అవుతాయని వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఐదు రౌండ్ల చర్చలు జరిగాయి. ఆరవ రౌండ్ చర్చలు త్వరలోనే జరుగుతాయని అధికార వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఈసారి చర్చలు జరిగితే ఢిల్లీలోనే జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Nepal: మహిళా మంత్రిపై మూకుమ్మడి దాడి.. వెలుగులోకి వచ్చిన భయానక దృశ్యాలు
పాడి, వ్యవసాయంపై అమెరికా రాయితీలు కోరుతోంది. కానీ ఈ రెండు కూడా భారతదేశానికి జీవనాడి. ఈ నేపథ్యంలో రాయితీలు ఇచ్చేందుకు భారత్ మొగ్గు చూపడం లేదు. దీంతో చర్చలు ప్రతిష్టంభన చోటుచేసుకున్నాయి. కొత్త చర్చలు అక్టోబర్‌లో జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అన్నదాతలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా.. ఒప్పుకోకూడదని భారత్ భావిస్తోంది. చౌకైన అమెరికా వస్తువులు దిగుమతి అయితే భారతీయ పాడి, వ్యవసాయం దెబ్బతింటోందని భారత్ ఆలోచిస్తోంది.
మొక్కజొన్న, సోయాబీన్స్, ఆపిల్, బాదం, ఇథనాల్ వంటి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించే ప్రతిపాదనలను కూడా భారతదేశం తోసిపుస్తోంది. అనుమతిస్తే భారత రైతులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఢిల్లీ భావిస్తోంది. ఒకవేళ అమెరికా నుంచి సానుకూల నిర్ణయం లేకపోతే భారత్ దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. అయినా కూడా రాత్రికి రాత్రే విభేదాలు పరిష్కరించబడవని ఒక సీనియర్ అమెరికా అధికారి అన్నారు.
భారత్‌పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా ట్రంప్ మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. దీంతో అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే అన్నదాతల కోసం ఎంత భారమైనా భరిస్తామని మోడీ ప్రకటించారు.

India and the US are close friends and natural partners. I am confident that our trade negotiations will pave the way for unlocking the limitless potential of the India-US partnership. Our teams are working to conclude these discussions at the earliest. I am also looking forward… pic.twitter.com/3K9hlJxWcl
— Narendra Modi (@narendramodi) September 10, 2025
- Tags
- america
- india
- PM Modi
- Trade talks
- trump
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!