Trump: తైవాన్ జోలికి పోవద్దు.. చైనాకు వార్నింగ్.. కొద్దిరోజులకే మారిన ట్రంప్ స్వరం
- తైవాన్ జోలికి పోవద్దు
- చైనాకు వార్నింగ్
- కొద్దిరోజులకే మారిన ట్రంప్ స్వరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలే దక్షిణ కొరియా వేదికగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. ఆరేళ్ల తర్వాత ఇద్దరూ కలిశారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ను ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. సమావేశం తర్వాత 10 శాతం సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. కానీ ఇంతలోనే ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. తాజాగా చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయనుకుంటున్న సమయంలో హెచ్చరికలు జారీ చేశారు. తైవాన్‌పై దాడిచేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు ఆ దేశ ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Trump: పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతోంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- US News: 19 ఏళ్ల యువకుడికి "హిందుత్వం"పై ఇంత ద్వేషమెందుకు?
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ఆదివారం సీబీఎస్ న్యూస్‌తో ‘60 మినిట్స్’ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా తైవాన్‌పై చైనా దాడి చేస్తే అమెరికా సైన్యం పాల్గొంటుందా..? అని ప్రశ్న ఎదురైంది. ‘‘ఇక్కడ నేను ఎలాంటి రహస్యాలు చెప్పలేను. అలాంటిది ఏదైనా జరిగితే మీకే ఆ విషయాలు తెలుస్తాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నంతకాలం మేం ఏమీ చేయబోమని వారు చెప్పారు. ఎందుకంటే వారికి పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు.’’ అని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఏఐ శక్తిని ఉపయోగకరంగా మారుస్తాం.. అభివృద్ధిలో లక్ష్యాన్ని ఛేదిస్తామన్న మోడీ
గత వారం దక్షిణ కొరియా వేదికగా ట్రంప్, జిన్‌పింగ్ సమావేశం అయ్యారు. రెండు గంటల పాటు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. చైనాపై టారిఫ్‌లను 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అరుదైన ఖనిజాలకు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైందని చెప్పారు. చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. కానీ ఇంతలోనే ట్రంప్ స్వరం మారింది. కొద్దిరోజులకే ఏం జరిగిందో.. ఏంటో తెలియని పరిస్థితి.
- Tags
- america
- china
- Jinping
- Trump warning
- us
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..