బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం మరింత రచ్చగా మారుతోంది… ఈనెల 14న ఆత్మహత్యాయత్నం చేసిన సాయి గణేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.. అయితే, ఆత్మహత్యాయత్నం తర్వాత మీడియాకు సాయి గణేష్ ఇచ్చిన బైట్ సంచలనంగా మారింది.. మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు పోలీసులపై ఆరోపణలు చేశాడు సాయి.. దీంతో.. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అయితే, ఈ కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రంగంలోకి దిగారు. Read Also:…
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను వరుసగా ఎండగడుతూ వస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్.. తాను ఈ మధ్య ఏ సభలో పాల్గొన్న కేంద్రం విధానాలను తప్పుబడుతున్నారు.. ఇక, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆయన.. ట్విట్టర్ వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు.. వరుస ట్వీట్లతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. 30 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం అనే ఓ జాతీయ మీడియా కథనాన్ని షేర్ చేసిన మంత్రి కేటీఆర్.. అందులో…
టీఆర్ఎస్‌కు పట్టున్న నియోజకవర్గాల్లో దుబ్బాక ఒకటి. గులాబీ పార్టీ నుంచి సోలిపేట రామలింగారెడ్డి వరసగా విజయం సాధిస్తూ వచ్చారు. అంతకుముందు ఈ నియోజకవర్గం దొమ్మాటగా ఉండేది. అప్పుడు కూడా సోలిపేట రెండుసార్లు గెలిచారు. గత ఏడాది సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ తరఫున రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమితో సుజాత కొద్దిరోజులు సైలెంట్ అయ్యారు. కానీ.. ఇప్పుడిప్పుడే ఆమె యాక్టివ్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో…
బండి సంజయ్ పాదయాత్ర ఇక్కడ చేసుడు కాదు ఢిల్లీ యాత్ర పెట్టి తెలంగాణ కు రావాల్సిన నిధులు తెప్పించు అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్‌కు రైతు కృతజ్ఞత సభను సోమవారం చెన్నూరులో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న బాల్క సుమన్ మాట్లాడుతూ.. బీజేపీ లీడర్ల కొడుకులు ఏసీ ల్లో ఉంటారు.. సాధారణ బీజేపీ కార్యకర్తలు వారి కొడుకులు లొల్లి పెట్టుకొని, సోషల్ మీడియాలో పోస్టు లు చేసి…
తెలంగాణలో ఏ పార్టీ ఏ ప్రభుత్వము ఇవ్వని కరెంటు ఉచితంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తుందని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీ ఉడుతా ఉపులకు ఎవరు భయపడ్డారు బండి సంజయ్ అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్, బీజేపీ గాని ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టారా అని ఆయన ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా…
ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని కమిషన్ అంటోందని ఆరోపించారు. దీనిపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ టి. రంగరావు స్పందిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు నేను విద్యుత్ సంస్థలకు చేసిన సలహాలు, సూచనల కాపీని పంపిస్తాను. ఆయన చదువుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. రఘునందన్ రావు విద్యుత్ మీటర్ల బిగింపు పై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. గత నెలలో విద్యుత్ టారిఫ్ ఆర్డర్…
ఈ నెల 27న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకను హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు హెచ్‌ఐసీసీలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై సలహాలు, సూచనలు స్వీకరించామని, ప్లీనరీని విజయవంతం చేయడానికి కొన్ని కమిటీలను ఏర్పాటు చేసుకోవడం…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం భువనగిరి మండలం తుక్కపురం గ్రామంలోని పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతానికి చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. విద్యతో మనిషుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. గిరిజనులకు, దళితులకు, బలహీన వర్గాలతో పాటు మైనార్జీలకు…
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు రాష్ట్రంలో పర్యటించనున్నారు.. అందులో భాగంగా వరంగల్‌లో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.. ఆ సభలో పాల్గొని ప్రసంగించనున్న రాహుల్ గాంధీ.. అయితే, రాహుల్ కంటే ముందే వరంగల్ పర్యటనకు సిద్ధం అయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఈ నెల 20వ తేదీన ఆయన వరంగల్ టూర్ ఖరారైంది.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆయన..…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. తన రెండో దశ పాదయాత్రను జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభించారు బండి సంజయ్.. అయితే, ఇవాళ సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు యత్నించాయి. ఇటిక్యాల మండలం వేములలో బండి సంజయ్ పాదయాత్రకు నిరసన వ్యక్తం చేశారు. ఇక, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేయడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు రోజుల ప్రశాంతంగా కొనసాగిన యాత్రలో ఐదో రోజు…