తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన చుట్టూ ఉన్నవారికి ఏ కష్టం వచ్చినా.. నేనున్నా అని ముందుంటారు. మొన్నామధ్య ముడిమ్యాల క్యాసారం గేట్ల మధ్య ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే అదే సమయంలో వికారాబాద్ పర్యటన ముగించుకుని మొయినాబాద్ వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రమాద స్థలం వద్ద తన కాన్వాయ్ అపి క్షతగ్రాతులను ప్రత్యేక వాహనంలో తరలించారు. అంతేకాకుండా ఆ తరువాత ఆ ప్రమాదంలో గాయపడ్డ వారి యోగక్షేమాలపై ఆరా…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఖమ్మంలో ఓ కార్యకర్తపై పీడీ యాక్ట్ పెట్టి వేధిస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రతి లెక్కా తేలుస్తామని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. గ్రానైట్ వ్యాపారైన ఖమ్మంకు చెందిన ఎండీ ముస్తఫా (39) అనే కాంగ్రెస్ కార్యకర్తను…
శుభమా అని కెటీఆర్ వస్తానంటే…ఆయనేదో మర్యాదగా భోజన ఏర్పాట్లు చేస్తానన్నారు…కానీ, ఆ విందు ఏర్పాట్లే సమస్యగా మారతాయని ఊహించి ఉండరు..ఇంత మంది పార్టీ నేతలు కాదంటున్న వరుసలో…కెటీఆర్ మాత్రం భోజనానికి కూర్చుంటారా ఏమిటి అని ప్రశ్నిస్తున్నాయి..పార్టీ వర్గాలు.. ఇంతకీ ఖమ్మం గుమ్మంలో కెటీఆర్ అడుగుపెట్టేదెపుడో మరి..? విందుభోజనమే కెటీఆర్ టూర్ వాయిదాకు కారణమ ఖమ్మం గులాబి నేతల మధ్య విభేదాలు మరింత పెరుగుతున్నాయా? ఖమ్మం జిల్లా కేంద్రంలో అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా మంత్రి కెటిఆర్ పర్యటించాల్సి ఉంది.…
తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్లలో ఆయనొకరు..నాలుగుసార్లు అసెంబ్లీకి వెళ్లినా,ఆయనకు దక్కిన పదవులు మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి.ఎప్పటికప్పుడు ఆ పదవి, ఈ పదవి అని ఊహాగానాలు తప్ప ఒరుగుతున్నదేమీలేదు..ఆఖరికి ఇంత హైప్ మీద కారెక్కిన తర్వాత..ఇంకా వెయిటింగ్ లిస్టు తప్పదా అనే టాక్ నడుస్తోంది. మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు రాజకీయాల్లో దక్కిన పదవులు మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి. ఎనభైల్లోనే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి, ఆలేరు…
వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా? ఎన్నికల్లో పోటీ చేయగలమా? రాజకీయ భవిష్యత్ ఏంటి? ఈ ప్రశ్నల చుట్టూనే కొందరు టీఆర్ఎస్ నేతల ఆలోచనలు ఉన్నాయట. ఉన్నచోటే ఉంటే.. ఛాన్స్ రాకపోతే ఎలా అనే ఆందోళనలో మరోదారి వెతుక్కునే పనిలో ఉన్నట్టు టాక్. రాజకీయ అవకాశాల కోసం లెక్కలతో కుస్తీ పడుతున్నారట. జంపింగ్ జపాంగ్‌ల కాలం మొదలైందా? తెలంగాణలో రాజకీయ వేడి నెలకొంది. ఎన్నికలకు ఇంకా టైమ్ ఉన్నా.. ఇప్పటి నుంచే జాగ్రత్త పడే పనిలో బిజీ అవుతున్నారు…
యాసంగి ధాన్నాన్ని నేటి నుంచి తెలంగాణ ప్రభుత్వం కొనుగోళు చేయనుంది. ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పండిన ధాన్యం కేంద్రం కొనాల్సి ఉన్నా కొనకపోవడంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పండిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిలా రైతులు నష్టపోవద్దనే ఈరోజు నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారని ఆయన…
యాసంగి వరిధాన్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత వచ్చింది. అయితే కేసీఆర్ ప్రకటనతో సీఎస్ సోమేశ్ కుమార్ అధికార యంత్రాంగానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ విషయమై జిల్లా కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో నేటి నుంచి కొనుగోలు కేంద్రాల వద్ద యాసంగి కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుంది.
కొంత కాలంగా అధికారపార్టీలో చర్చగా మారిన ఆ మాజీ ఎంపీ.. మరోసారి మాటల తూటాలతో చర్చల్లోకి వచ్చారు. పదవి ఉన్నా లేకున్నా ఒకేలా ఉండాలంటూ కొత్త అస్త్రాలు వదిలారు? ఇంతకీ ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేశారు? ఎవరా మాజీ ఎంపీ? రాజకీయ వ్యూహాలు ఆపని పొంగులేటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మాజీ ఎంపీ. టీఆర్ఎస్ నేత. కొంత కాలంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారపార్టీలో చర్చల్లో ఉన్న నాయకుడు. తన వర్గంతో కలిసి కొత్త రాజకీయ…
ప్రజాసంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గత సంవత్సరం పాదయాత్ర ప్రారంభించారు. అయితే నేటి నుంచి జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి రెండో దశ ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు. అయితే నేడు డా. బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా జోగులాంబ జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి దళితుడిని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీ, మోడీది అని ఆయన కొనియాడారు. అంబేద్కర్ స్పూర్తితో…