సుధీర్ఘ చర్చల తర్వాత జిల్లా అధ్యక్ష పదవులను భర్తీ చేసింది అధికార టీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రమే పార్టీకి జిల్లా అధ్యక్షులు ఉండేవారు. ఆ తర్వాత ఈ పదవుల జోలికి వెళ్లలేదు అధిష్ఠానం. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేనే సుప్రీం అని గులాబీ పార్టీ స్పష్టం చేసింది. కానీ.. కొద్ది నెలల క్రితం రాష్ట్రంలోని 33 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది టీఆర్ఎస్. వీరిలో ఎక్కువగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్‌లు ఉన్నారు. నియామక ప్రక్రియ…
ఆస్పత్రుల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.. ఇక, మెదక్ జిల్లాకు త్వరలోనే మరో మెడికల్ కాలేజీలు వస్తాయని వెల్లడించారు హరీష్‌రావు.. త్వరలో పటాన్‌చెరులో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి…
తెలంగాణలో రెండు ఘటనలు రాజకీయంగా ప్రకంపనలు కలిగిస్తున్నాయి. భువనగిరిలో హోంగార్డు రామకృష్ణ కిడ్నాప్, హత్య కలకలం రేపగా.. కామారెడ్డిలో తల్లీ, కుమారుడు ఆత్మాహుతి కేసు. దీనిపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించారని 306 సెక్షన్ కింద ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు ప్రత్యేక విచారణాధికారిగా బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డిని నియమించారు. ఈ కేసులో ఏ-1గా రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఏ-2గా సరాఫ్ యాదగిరి, ఏ-3 గా…
బీజేపీ నేతలతో పాటు.. కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి హరీష్ రావు.. కాంగ్రెస్, బీజేపీ నేతల కళ్లకు పచ్చకామెర్లు సోకాయంటూ ఎద్దేవా చేసిన ఆయన.. రాష్ట్రంలో అమలు అవుతున్న దళిత బంధు ప్రతిపక్ష నేతలకు కనిపించడం లేదా? అని నిలదీశారు. ఏడేళ్ల బీజేపీ పాలనలో సామాన్యులపై ధరల భారం పెంచారని మండిపడ్డారు.. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా..?, తెలంగాణలో ఉన్నన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు ఏ రాష్ట్రంలోనైనా…
మరోసారి తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. కొత్తగూడెం నియోజకవర్గం సుజాతానగర్‌లో రైతుగోస ధర్నాలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డిఅనే ఒక ఎమ్మెల్సీ ఉన్నారు.. వరి ధాన్యం కొంటున్నాం కదా ఎవరు మాట్లాడకూడదు అంటున్నాడట.. టీఆర్‌ఎస్‌ని ఏమైనా అంటే వరి కంకులతో కొట్టమని చెప్పాడట అంటూ మండిపడ్డారు. ఇక, తప్పులు చేస్తున్న కేసీఆర్‌ని దేంతో కొట్టాలి అని ప్రశ్నించారు…
ఖమ్మం రాజకీయాలను ఇప్పుడు మంత్రి పువ్వాడ అజయ్ హీటు పుట్టిస్తున్నారు.. బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడం ఓవైపు అయితే.. మరోవైపు.. కాంగ్రెస్ నేతలపై కూడా వేధింపులు పెరిగాయంటూ జిల్లా నేతలతో పాటు.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.. ఇక, ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి… పువ్వాడ ఓ సైకో అని కామెంట్ చేసిన ఆయన.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి పువ్వాడ…
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరపనున్నారు. పార్టీ 22వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ఇతర మండలస్థాయి ప్రతినిధులకు ఆహ్వానం ఉంటుంది. ఇటు ప్రత్యేక ఆహ్వానితులుగా.. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. Read Also: COVID 19: కరోనాకు కొత్త మందు.. స్ప్రేతో…
మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులతో ఓ యువకుడు ప్రాణాలు తీసుకోవడం ఖమ్మం జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి.. దీనిపై సీరియస్‌గా స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మంత్రి పువ్వాడ, బాధ్యులైన పోలీసులు, నాయకులపై హత్య కేసు నమోదు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.. మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయకపోవడం సిగ్గు చేటన్న ఆయన.. సీఎంవో నుండి వచ్చిన ఆదేశాలవల్లే కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు.. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు.. నమ్మిన సిద్ధాంతం…
వానాకాలం సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కోటి 42 లక్షల ఎకరాలలో వానాకాలం సాగు జరిగే అవకాశం ఉందన్నారు. 70 నుండి 75 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు, 50 లక్షల ఎకరాలలో వరి, 15 లక్షల ఎకరాలలో కంది, 11.5 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గత ఏడాది పత్తి వేయకుండా రైతులు నష్టపోయారని…
మే 6,7 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణకి వస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు భరోసా ఇవ్వడం కోసం రాహుల్ గాంధీ వస్తున్నారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఇక్కడ బాధ పడుతున్న వర్గాలకు అండగా ఉండాలని నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. రైతులు కల్లాల్లో గుండె ఆగి చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామాలు వేశాయని ఆయన మండిపడ్డారు. వరి వేస్తే ఉరి అని…