రాజకీయాల్లో పదవులు, ప్రాధాన్యత ఉంటేనే నేతలు పార్టీతో ఉంటారు..దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి.పదవులు దక్కకపోతే, పార్టీలు మారటానికి, జెండాలు, కండువాలు మార్చటానికి నేతలు ఎప్పుడూ వెనుకాడరు. అధికార పార్టీలో ఉన్నా, విపక్షంలో ఉన్నా, నేతల చూపు ఎప్పుడూ కుర్చీపైనే ఉంటుంది.అధికార టిఆర్ఎస్ పార్టీలో ఈ మధ్య ఇలాంటి ఆసక్తికరమైన చర్చ ఒకటి మొదలైందట. టిఆర్ఎస్ లో కొంతకాలం మంత్రులుగా ఉండి, ఇప్పుడు మాజీలైన వారున్నారు..అదే సమయంలో ఒకప్పుడు చక్రం తిప్పి, ఇతర పార్టీల్లో ఓ స్థాయిలో…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర నేడు 8వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల్ జిల్లాలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్ మతి తప్పిందని ఆయన విమర్శించారు. హుజూరాబాద్ లో ధర్మం గెలిచిందని, హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యం,తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచిందని ఆయన అన్నారు. ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని…
ఈ నెల 6 ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలోని వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు సంఘర్షణ సభను నిర్వహించారు. అయితే రైతు సంఘర్షణ సభ స్థలాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లో కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో టీపీసీస రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఆనాడు రజాకార్లు, ఇప్పుడు కేసీఆర్ ప్రజలను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల…
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ధాన్యం కొనమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. సీఎ కేసీఆర్ ఆదేశాల మేరకు వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించింది. అయితే ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. Kకేంద్ర మంత్రి కిషన్…
దోపిడీకి వ్యతిరేకంగా అప్పుడు నిజాం నవాబుని తరిమి కొట్టి ప్రపంచానికి చాటి చెప్పిన గడ్డ వరంగల్ అని కాంగ్రెస్ అధిష్ఠానం సూచన మేరకే.. వరంగల్ లో రైతు సంఘర్షణ సభ పెట్టనున్నట్లు టీపీసీసీ రేవంత్ రెడ్డి వెల్లడించారు. గురువారం వరంగల్ లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఎన్నికల కోసం పెడుతున్న సభ కాదు.. రైతుల కోసం పెడుతున్న సభ అన్నారు. సభ విజయవంతం చేసేందుకు ప్రజలే బాధ్యత…
తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రాహుల్ గాంధీ వస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ బహిరంగ సభను శ్రేణులు విజయవంతం చేయాలన్నారు. చెన్నూరుకు ఎత్తిపోతల పథకం మంజూరు చేసి మంథని ప్రాంతాన్ని చిన్న చూపు చూడడం దురదృష్టకరమన్నారు. మంథని ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందని, నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న…
ఉత్తర కుమారుడు, తుపాకీ రాముడు, బుడ్డార్ ఖాన్ లను కలిపితే ఒక కేటీఆర్ అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ పాగల్ అయిపోయిండా అని చర్చ జరుగుతుందని, మనిషి పిచ్చికుక్కను కలిస్తే కేటీఆర్‌లా అవుతాడని, నాటు వైద్యమే దీనికి మందని ఆయన మండిపడ్డారు. కేటీఆర్‌కి పచెంబ ట్రీట్ మెంట్ ఇవ్వాలని, ఆముదం తీట కోయిలాకు పూసి పచ్చి చింత బరిగెలతో కొట్టడమే ఆ ట్రీట్ మెంట్…తోలు దొడ్డు అయిందన్నారు. ఎగిరే గుర్రం…
కేటీఆర్ ఫ్రస్టేషన్‌తో ప్రజా సమస్యలపై చర్చ రాకుండా తిట్ల మీదే చర్చ వచ్చేలా మాట్లాడారని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి 3 లక్షల కోట్ల పైచిలుకు ఇస్తే.. ఒక కోటి ఆరవై లక్షలు మాత్రమే తెలంగాణకు ఇచ్చిందని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడం ఏంటని, అవి టీఆర్‌ఎస్, బీజేపీ పైసలు కాదు..ప్రజలు కట్టిన టాక్స్ లు.. అని ఆయన మండిపడ్డారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది…
ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేవన్నీ గాలి మాటలు మాత్రమే.. పెంచిన గ్యాస్ ధరలకు మోడీకి దండం పెట్టాలన్నారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటిసారిగా నర్సంపేట నియోజకవర్గంలో పైపుల ద్వారా ఇంటింటికీ నేచురల్ గ్యాస్ పంపిణీ ప్రారంభించాం.. నర్సంపేటలో తక్కువధరకు 12,600 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం.. ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచిన నర్సంపేటలో అభివృద్ధి చూపించిన ఘనత…
గ్రేటర్ హైదరాబాద్ నేతలతో టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు పార్టీలో చర్చగా మారాయి. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉప్పల్ నియోజకవర్గ పంచాయితీ బట్టబయలైంది. నియోజకవర్గ పరిధిలో ఎవరి పర్యవేక్షణలో కార్యక్రమాలు జరగాలన్నదానిపై చర్చ హీటెక్కించిందట. దాని చుట్టూనే ప్రస్తుతం పార్టీ వర్గాల చెవులు కొరుకుడు ఎక్కువైంది. ఎమ్మెల్యే పర్యవేక్షణలోనే కార్యక్రమాలు జరగాలని ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి ప్రతిపాదించారట. ఆ మాటలు వినగానే కేటీఆర్ తీవ్ర అసంతృప్తి…