రాజకీయాల్లో పదవులు, ప్రాధాన్యత ఉంటేనే నేతలు పార్టీతో ఉంటారు..దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి.పదవులు దక్కకపోతే, పార్టీలు మారటానికి, జెండాలు, కండువాలు మార్చటానికి నేతలు ఎప్పుడూ వెనుకాడరు.
అధికార పార్టీలో ఉన్నా, విపక్షంలో ఉన్నా, నేతల చూపు ఎప్పుడూ కుర్చీపైనే ఉంటుంది.అధికార టిఆర్ఎస్ పార్టీలో ఈ మధ్య ఇలాంటి ఆసక్తికరమైన చర్చ ఒకటి మొదలైందట.
టిఆర్ఎస్ లో కొంతకాలం మంత్రులుగా ఉండి, ఇప్పుడు మాజీలైన వారున్నారు..అదే సమయంలో ఒకప్పుడు చక్రం తిప్పి, ఇతర పార్టీల్లో ఓ స్థాయిలో ఉండి ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్న నేతలూ ఉన్నారు..వీరందరి పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోందట
గులాబీ పార్టీలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై
రకరకాలుగా ప్రచారం జరుగుతోందట. ఇప్పటికే పార్టీలో తమకు గుర్తింపు లేదన్న భావనలో ఉన్న మాజీలు,
ఏదో ఒక దారి వెత్తుకునే పనిలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది.ఇటువంటి వారిని అలాగే పోనిస్తారా, లేక పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అనే చర్చ మొదలైంది
ఇతర పార్టీల నుంచి వివిధ సందర్భాల్లో టియ్యారెస్ లో జాయిన్ అయిన మాజీ ఎమ్మెల్యేలుఅవకాశం కోసం ఇంకా ఎంత కాలం వెయిట్ చేయాలన్న భావనలో ఉన్నారట.ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో చెప్పుకోదగ్గ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితులు లేవు.మరోవైపు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హీట్ క్రమంగా పెరుగుతోంది.దీనితో తమ రాజకీయ భవిష్యత్తుపై కొంత ఆందోళనలో ఉన్నారట.ఇటు పార్టీ నుంచి స్పష్టమైన హామీ లేకపోవడం కూడా ఆ నేతలు తమ భవిష్యత్తుపై ఆలోచించుకునేలా చేస్తోందనే వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాల మధ్య, తాజాగా టిఆర్ఎస్ పార్టీమాజీలపై నజర్ పెట్టిందన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోందట.
ఇప్పటికిప్పుడు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దన్న సంకేతాలు పంపుతోందట. దీంతో టియ్యారెస్ అధిష్టానం గతంలో అనేక హామీలతో పార్టీలో చేరి,ఇప్పుడు అసంతృప్తితో ఉన్నవారికి ఎలాంటి అవకాశాలు ఇస్తుందనే ఆసక్తి ఇప్పుడు ఏర్పడింది..మరి మాజీలు పార్టీ అవకాశం ఇచ్చే వరకు ఎదురు చూస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది..