బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్‌కు వెయ్యి కోట్ల నిధులు తీసుకొచ్చి… చేతనైతే అభివృద్ధిలో పోటీపడాలన్నారు కేటీఆర్. సోమ, మంగళవారం అంటూ రాజకీయం చేయొద్దన్నారు. కేసీఆర్ లేకపోతే జన్మలో తెలంగాణ వచ్చేది కాదన్నారు. కేసీఆర్, టీఆర్‌ఎస్ లేకుంటే తెలంగాణ పదం ఉండేదా? అని ప్రశ్నించారు కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం బండలింగంపల్లి గ్రామం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో రూ.28 లక్షలతో నిర్మించనున్న ఆధునిక భవన నిర్మాణం, నూతన మౌలిక సదుపాయాల కల్పన పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేసిన కేటీఆర్.. ఈ సందర్‌భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.
Read Also: RCB vs CSK: ఆ టార్గెట్‌ని చెన్నై చేధిస్తుందా?
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయంటే.. మరి మోదీ పైసలయితే దేశమంతా అభివృద్ధి కావాలి కదా? అని ప్రశ్నించారు బండి సంజయ్.. దేశంలోని 6 లక్షల పల్లెల్లో ఇలాంటి కార్యక్రమాలు అమలవుతున్నాయా? అని నిలదీశారు. తెలంగాణలోని పల్లెల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా లేవన్న కేటీఆర్.. అభినందించాల్సింది పోయి అక్కసు వెళ్లగక్కడం ఏంటి? అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశమంతా చీకట్లో ఉంటే.. తెలంగాణలో మాత్రం 24 గంటల పాటు కరెంట్ వెలిగిపోతోందన్నారు మంత్రి కేటీఆర్.