Bandi Sanjay : అది నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో దేవరకద్రలో బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర సభ నిర్వహించింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలమూరు నుంచి వలసలు లేవని అంటున్నారని, కానీ ఇప్పటికీ పాలమూరు ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లిపోతున్నారని ఆయన అన్నారు. పాలమూరు నుంచి వలసలు లేవని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలంటూ సీఎం కేసీఆర్ కు చాలెంజ్ చేశారు బండి సంజయ్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు జిల్లాను పచ్చగా చేస్తామని బండి సంజయ్ అన్నారు.
పాలమూరులో బీజేపీ ఎక్కడుందని టీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, పాలమూరులో ప్రాజెక్టుల నిర్మాణాలు కాంగ్రెస్, టీఆర్ఎస్ వల్ల పూర్తికాలేదని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వండని, తాము ప్రతి హామీని నిలబెట్టుకుంటామని బండి వ్యాఖ్యానించారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది జరగలేదన్న బండి.. చెక్ డ్యాంలు, ఇసుక కాంట్రాక్టులతో టీఆర్ఎస్ నాయకులు కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు.
Also Read
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?