MLC Kavitha : మరోసారి ఎంపీ అర్వింద్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన కవిత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి సెటైర్లు వేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పసుపు బోర్డు తెస్తానంటూ అబద్ధపు హామీలను ఇచ్చి ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచారని కవిత అన్నారు. ఆయన ధర్మపురి కాదని, అధర్మపురి అని విమర్శినస్త్రాలు సంధించారు. పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్లపై హామీ ఇచ్చిన అర్వింద్.. 3 ఏళ్లైనా పసుపుబోర్డు తీసుకురాలేదని మండిపడ్డారు. మోసం చేసిన ఎంపీ ఆర్వింద్‌ను ఎక్కడికక్కడ రైతులు అడ్డుకుంటారని కవిత వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి ఆయన తెచ్చిన నిధులు కూడా ఏమీ లేవన్న కవిత.. తాను ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు కోసం ఎంతో ప్రయత్నించానని వెల్లడించారు.
ప్రధాని మోదీని, అప్పటి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా పసుపుబోర్డు విషయమై కలిసినా.. ఎలాంటి ప్రయోజనం లేదని ఆమె వివరించారు. అర్వింద్‌కు తాము ఇప్పటికే మూడేళ్ల సమయం ఇచ్చామని… ఇకపై ఉపేక్షించబోమని కవిత హెచ్చరించారు. బీజేపీ శ్రేణులు తమపై దాడులకు పాల్పడాలని చూస్తే ఊరుకోబోమని, తెలంగాణ ఉద్యమ సమయంలో పారామిలిటరీ బలగాలను ఎదుర్కొన్న అనుభవాలు తమకు ఉన్నాయని ఆమె ఘాటుగా స్పందించారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!