* మరోసారి రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు, రేపు విచారణకు రావాలని పేర్కొన్న ఈడీ, నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే వరుసగా మూడు రోజుల పాటు రాహుల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు.
* నేడు చలో రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ పిలుపు, సోమాజిగూడ నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ నేతల ర్యాలీ
* అనకాపల్లి జిల్లాలో రెండు రోజు చంద్రబాబు పర్యటన, అనకాపల్లిలో జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు, నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకలాపాలపై సమీక్ష
* పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కారుమూరి
* నేడు శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సమావేశం
* నేడు విశాఖ జిల్లాలో మంత్రి విడదల రజని పర్యటన, జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొననున్న మంత్రి
* నేడు బాపట్లలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
* నేడు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక వర్గంలో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్ పర్యటన.. రూ. 42.34 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపనలు
* నేడు కొడంగల్‌లో నిర్మించిన 50 పడకల ఆస్పత్రి నూతన భవనం, డయాలసిస్ సెంటర్ ప్రారంభం.. గిరిజన గురుకుల పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రారంభం.. కొడంగల్ మార్కెట్ యార్డ్ వద్ద బహిరంగ సభ.
* నేడు చింతకాని మండలం నుంచి ఖమ్మం వరకు కొనసాగనున్న వైఎస్ షర్మిళ పాదయాత్ర.. ఖమ్మంలో బహిరంగసభ
* నేడు ఎర్రుపాలెం మండలంలో కొనసాగనున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర