తెలంగాణలో ఐదు మున్సిపాలిటీలకు, రెండు కార్పొరేషన్లకు ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ వస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీని తెరాస పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 27 వార్డులు ఉండగా, 19 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో 16 వార్డులను తెరాస పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటె రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీని కూడా తెరాస పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డులు ఉండగా అందులో ఏడు వార్డుల్లో తెరాస…
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో ఓనర్ల పంచాయతీ, జీతగాళ్ల పంచాయతీ బయట పడిందని..ఈటల డిమాండ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని..కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు…ప్రభుత్వం చేతులెత్తేసిందని ఫైర్ అయ్యారు. సీఎం స్పందించడం లేదని.. ప్రజల దృష్టి మరల్చడానికే ఈ…
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ గ్రామాలకు చెందిన రైతుల భూములపై మంత్రి ఈటల కబ్జా పెట్టారనే ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను కుదిపేశాయి. అయితే ఈ కేసులో ఇప్పటికే సిఎం కెసిఆర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ మంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణలపై విచారణ మొదలైంది. అచ్చంపేట ప్రభుత్వ…
తనకు ఆత్మగౌరవం కంటే పదవి గొప్పకాదు అని స్పష్టం చేశారు మంత్రి ఈటల రాజేందర్.. ఆయనపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ కాగా.. విచారణకు సైతం ఆదేశించారు సీఎం కేసీఆర్.. అయితే, ఈ పరిణామాల తర్వాత వివరణ ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమేనని ప్రకటించారు.. భూ కబ్జా ఆరోపణలు కట్టుకథలుగా కొట్టిపారేసిన ఆయన.. 20 ఏళ్లుగా ఈటల అంటే ఏంటో అందరికీ తెలుసన్నారు..…
తెలంగాణలో ఎన్టీవీ కథనం సంచలం సృష్టించింది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా బాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. జమున హ్యాచరీస్ కోసం పేదలను, అధికారులను బెదిరింపులకు గురిచేసి వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈటల అనుచరులు తమను బెదరించి భూములు లాక్కొన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట్ లో ఇది వెలుగు చూడగా.. 130/5, 130/10, 64/6 సర్వే నెంబర్లలో గల భూమిని…
ఆయనో బీసీ మంత్రి…. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాల్సిన ఆయనే.. వారి అసైన్డ్ భూములపై కన్నేశాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు పేదలను భయపెట్టాడు.. నాయానో భయానో భూములు కాజేసేందుకు అధికారాన్ని అడ్డుగోలుగా వాడుకున్నాడు. మంత్రి దర్పాన్ని.. భూములు కాజేసేందుకు పేదలను భయపెట్టేందుకు వాడుకున్నాడు. కోళ్ల ఫామ్‌ల కోసం తోడేలుగా మారి రైతుల భూములను మింగేశాడు. అతనే తెలంగాణలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్. ఆయన భార్య జమున పేరుతో హ్యాచరీస్ వ్యాపారం…
అధినేత దృష్టిలో పడేందుకు కొత్త ఎత్తుగడ వేశారా? రాజ్యాంగ పదవిలో ఉన్నా.. విపక్ష పార్టీపై విమర్శలకు కారణం కూడా అందుకేనా? కల సాకారం చేసుకోవడానికి.. ఎక్స్‌టెన్షన్ పొందడానికి ఆయన ఎంచుకున్న మార్గం వర్కవుట్ అవుతుందా? ఇంతకీ ఎవరా పెద్దాయన? ఏమా కథ? త్వరలో ముగియనున్న గుత్తా ఎమ్మెల్సీ పదవీకాలం! గుత్తా సుఖేందర్‌రెడ్డి. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న నేత. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి ఛైర్మన్. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఎంపీగా పనిచేశారు గుత్తా. మంత్రి కావాలన్నది ఆయన చిరకాల…
లింగోజిగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ శ్రీ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా మృతి చెందారు. ఈ డివిజన్ కు ఏప్రిల్ 30 నాడు జరగనున్న ఉప ఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నందున…
ఇదివరకు కాంగ్రేస్ హయాంలో చేసిన డెవెలప్ మెంటే ఇప్పుడు ఉంది. మేం వేసిన రోడ్లన్నీ తవ్వుతున్నారు. సిటీలో ఎక్కడా నీళ్లు రాని పరిస్థితి నెలకొంది మిషన్ భగీరథ నిధులతో కేసీఆర్ ఫామిలీ మాత్రమే డెవెలప్ అయింది అని కొండా సురేఖ అన్నారు. భగీరథ లో కమీషన్ లు దండుకుంటున్నారు. ఇన్నిరోజులు వరంగల్ ప్రజల ముఖం చూడని కేటీఆర్ ఇప్పుడేందుకు వచ్చారు. సిటీలో కొత్త పనులు ఏమీ లేవు.. పాత వాటినే ఓపెనింగ్ చేసి పోయిండు. టీఆరెస్ పాలనలో…
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్దానికి తెరలేపాయి.. బుధవారం రోజు బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డిపై సీఎం కేసీఆర్ కామెంట్లు చేయగా.. సీఎం వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు జానారెడ్డి.. ఈ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ అహంకారానికి.. సాగర్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్న ఆయన.. అధికార పార్టీ తీరు తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చావు…