తెలంగాణ ప్రభుత్వంపై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తెలంగాణలో పరిపాలన కోమాల్లో ఉందని..పక్క రాష్ట్రం తమిళనాడులో ప్రతిపక్ష నాయకులతో కమిటీ వేశారని చురకలు అంటించారు. తెలంగాణ సర్కార్ ఇకనైనా ఒంటెద్దు పోకడలు మానుకోవాలని.. కరోనా అందరినీ కబలిస్తుందన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ కూడా అందివ్వడం లేదని.. కేటీఆర్ కు టాస్క్ ఫోర్స్ బాధ్యత ఇవ్వగానే వ్యాక్సిన్ వేయడమే మానేశారని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో కేసులు పెరుగుతున్నా పరీక్షలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ…
ఈటల హుజురాబాద్ రావడం తండ్రి కాళ్ళు మెక్కడం.. ప్రెస్ మిట్ పెట్టడం ఆత్మగౌరవం తో రాజీనామా చేస్తాడేమో అనుకున్నా… ఈటల రాజేందర్ ముఖంలో నిరాశ ప్రస్టేషన్ లో ఉండి వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఇన్ డైరెక్ట గా నాపై విమర్శలు చేసాడు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. భూములపై ఎంక్వరి వేస్తే ఆధారాలు లేక నువ్వే ఒప్పుకున్నాం. ఏ ముఖ్యమంత్రి గారి అయినా తప్పు చేసిన మంత్రి ని ఉంచరు అలానే నిన్ను భర్తరఫ్ చేశారు అని…
మా ప్రాంతానికి ఇంఛార్జ్ గా వస్తున్న వాళ్ళు ఇక్కడి ప్రజాప్రతినిధులు గెలుపులో ఏమన్నా సాయం చేశారా అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మాకు సహకరించకపోతే ఊరుకునేది లేదు అంటారా..సర్పంచ్ లకు ఎంపిటిసి లకు నిధులు రావు మీ గ్రామాలు అభివృద్ధి కావు అంటూ బెదిరిస్తున్నారు. మంత్రి కాక ముందు సంస్కారం లేకపోతే మంత్రి అయ్యాక అయినా సంస్కారం నేర్చుకోవాలి. కరీంనగర్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు వాళ్ళని చూసుకోవాలి తప్ప హుజురాబాద్ పై కక్ష…
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… సీఎంగా ఉండి రైతులు, ప్రజలు పట్టించుకోకుండా కాలాయాపన చేస్తున్న కేసీఆర్.. మీకే ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఇప్పటికైనా మేల్కొని మీ పార్టీ సమస్యలను ప్రక్కకు పెట్టి ప్రజా సమస్యలపైన దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇళ్లు కాలుతుంటే చుట్ట అంటించుకున్న చందా సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకునే పనులు మానుకోవాలని లేఖలో హితవుపలికిన కోమటిరెడ్డి.. రాష్ట్రంలో ఐకేపీ…
మంత్రి తలసానికి జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఇంట్లో కూర్చొని మాట్లాడొద్దని..తెలంగాణ ప్రజల ప్రాణాలతో కామెడీ చేయొద్దని చురకలు అంటించారు. సంగారెడ్డికి ఆసుపత్రికి రండి పోదామని.. కేసులు తగ్గాయని అని రుజువు చేస్తారా..? అని సవాల్ విసిరారు. సీఎం దగ్గర మంచి పెరుకోసం భజన చెయ్యకు.. కేంద్రం మీద కోట్లాది…రాష్ట్రంకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు.అంత మోగొడివి అయితే కిషన్ రెడ్డి ఇంటి ముందు కూర్చోవాలని.. గాంధీ ఆసుపత్రికి పొయ్యి చూడాలని చురకలు అంటించారు. రాష్ట్రంలో రెమిడేసివర్ ఇంజెక్షన్…
మాజీ మంత్రి ఈటలకు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కీలక నేతలు టీఆర్ఎస్ లోనే ఉంటామని ప్రకటించగా.. తాజాగా మంత్రి గంగులను శనిగరం, మర్రిపల్లిగూడెం ప్రజాప్రతినిధులు కలిసి ఈటలకు షాక్ ఇచ్చారు. మంత్రి గంగులను కలవడమే కాకుండా.. తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై మంత్రి గంగులకు వినతి పత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్బంగా మంత్రి గంగుల హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని…
సిఎం కెసిఆర్ కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ చురకలు అంటించారు. తన ఉనికిని దెబ్బ తీసేందుకు కెసిఆర్ సర్కార్ చాలా దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆయన ఫైర్ అయ్యారు. గొర్రెల మంద మీద తోడేళ్ళు దాడి చేసినట్లు దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణకు చైతన్యాన్ని నింపిన గడ్డ మీద కుట్ర చేస్తున్నారని…తెలంగాణ ఉద్యమంకు సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు మంత్రిగా బెదిరింపులకు దిగుతున్నారని గంగుల కమలాకర్ రావును టార్గెట్ చేశారు ఈటల. ఎన్ని కుట్రలు చేసినా..…
టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈ క్రమంలో ఈటల తన సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లో కార్యకర్తలు, నేతలతో చర్చించారు. ఇదిలావుంటే, తాజాగా ఈటల వరుసగా ఇతర పార్టీల ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటల భేటీ అయ్యారు. అంతకు ముందు…
పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అరెస్ట్ అయ్యారు. జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధును భీమవరంలో అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే పుట్టమధును ఏ కేసులో అరెస్ట్ చేశారో పోలీసులు మాత్రం చెప్పలేదు. ఏ కేసులో పుట్ట మధును అరెస్ట్ చేశారో చెప్పడానికి పోలీసులు నిరకరించినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. గత కొన్ని రోజులుగా పుట్ట మధు అజ్ఞాతంలో ఉన్నారు. నిన్న మధు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో…
ఈటల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ మేకవన్నె పులి… ఈటల రాజేందర్ పచ్చి అబద్ధాల కోరని మండిపడ్డారు. బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల అని మంత్రి గంగుల ఫైర్ అయ్యారు.ఈటల రాజేందర్ కు సీఎం కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఉందా?.. ఈటల టీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్నపుడు ఆ పదవిని దుర్వినియోగం చేశారని నిప్పులు చెరిగారు. బీసీలను దగ్గరకు రానీయలేదు.. ఈటల వ్యాపార భాగస్వామ్యులు…