కేసీఆర్ కామెంట్స్… జానారెడ్డి కౌంటర్ ఎటాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్దానికి తెరలేపాయి.. బుధవారం రోజు బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డిపై సీఎం కేసీఆర్ కామెంట్లు చేయగా.. సీఎం వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు జానారెడ్డి.. ఈ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ అహంకారానికి.. సాగర్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్న ఆయన.. అధికార పార్టీ తీరు తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించానంటున్నారు.. కానీ, కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో చావు నోట్లో తల పెట్టి తెలంగాణ ఇచ్చిందన్న విషయం మరచిపోవద్దు అన్నారు జానారెడ్డి.
తెలంగాణ సాధన కోసం మేం పూర్తిగా సహకరించాం కాబట్టే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు జానారెడ్డి.. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదన్న ఆయన.. తెలంగాణ ఏర్పాటు కోసం మంత్రులతో రాజీనామా చేయించింది జానారెడ్డి కాదా.. జేఏసీ ఏర్పాటు అయ్యింది నా ఇంట్లో కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి.. 30, 40 ఏళ్లు శాంతి సామరస్యాలు వెల్లివిరిసేలా నేను పనిచేశాను.. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నారు.. హైదరాబాద్‌లోనే కుర్చీ వేసుకుని కూర్చున్నారు అంటూ కేసీఆర్‌పై సెటైర్లు వేశారు.. పదవుల కోసమే కాదు.. ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా నేను ఏనాడూ ఎవరి చుట్టూ తిరిగింది లేదన్నారు జానారెడ్డి.
Also Read
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!