టీఆర్ఎస్ అభ్యర్థికి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి మద్దతు ఇచ్చినట్లు కొంత మంది పోస్టులు పెట్టారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్పందించారు. ఒక ఆడపిల్లను ఎదుర్కొనలేక బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
By-elections in Munugode, Adampur, Andheri East and 4 other seats: తెలంగాణలో మునుగోడుతో పాటు దేశవ్యాప్తంగా పలు కీలక అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల కాలంలో మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారిగా ఆ రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి ఈ ఎన్నికలకు కీలకంగా మారాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఈ రోజు జరగుతున్నాయి.…
ఇప్పుడు మునుగోడు బై పోల్ పై దృష్టి పెట్టారు బెట్టింగ్ రాయుళ్లు.. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంటుందని.. ఓ రెండు పార్టీల మధ్యే గట్టి పోటీ జరుగుతుందని.. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోనే బయటపడే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.. దీనిని క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగిన బెట్టింగ్ రాయుళ్లు.. మునుగోడులో గెలుపెవరిది? అంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు..
Bandi Sanjay Resign: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి బండి సంజయ్ రాజీనామా చేసినట్టుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ 31వ తేదీనే రాసినట్లుగా ఉన్న ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.