Munugode Bypoll: మునుగోడులో గెలుపెవరిది..? రంగంలోకి బెట్టింగ్ రాయుళ్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌కు సమయం దగ్గర పడింది… నిన్న సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడగా.. ప్రలోభాలపర్వం జోరుగా సాగుతోంది… ఓ వైపు మద్యం.. మరోవైపు డబ్బులు పంపిణీకి తెరలేపాయి ఆయా పార్టీలు.. ఇక, క్రికెట్ మ్యాచ్‌లకే పరిమితం కాదు.. ఏదైనా ఎన్నికలు జరిగినా..? ఆ ఎన్నికలపై ప్రముఖంగా చర్చ సాగుతున్నా.. బెట్టింగ్ రాయుళ్లు దిగిపోతున్నారు.. ఇప్పుడు వాళ్ల దృష్టి మునుగోడు బైపోల్‌పై పడింది.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంటుందని.. ఓ రెండు పార్టీల మధ్యే గట్టి పోటీ జరుగుతుందని.. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోనే బయటపడే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.. దీనిని క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగిన బెట్టింగ్ రాయుళ్లు.. మునుగోడులో గెలుపెవరిది? అంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు..
Read Also: Challa Bhageerath Reddy is No More: ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత
Also Read
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
వెయ్యికి రెండు వేల రూపాయలు.. లక్షకు రెండు లక్షల రూపాయలు అంటూ.. కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుందనే ప్రచారం సాగుతోంది.. హైదరాబాద్‌లోని హోటల్స్‌లో తిష్టవేసిన బూకీలు.. మధ్య వర్తులుగా ఏజంట్స్‌ను పెట్టుకుని బెట్టింగ్ చేస్తున్నారట.. కొందరు నచ్చిన పార్టీపై బెట్టింగ్ కాస్తుంటే.. కొందరు ఎవరు గెలిచే అవకాశం ఉంది? అనే విషయాలను బేరీజు వేసుకుని డబ్బులు పెడుతున్నారట.. బెట్టింగ్ పర్వంలో అడ్వాన్స్‌ల రూపంలోనూ డబ్బుల వసూళ్లు, చెల్లింపులు సాగుతున్నాయని తెలుస్తోంది.. క్రికెట్ మ్యాచ్‌ల తరహాలోనే మునుగోడు బైపోల్ బెట్టింగ్ జరుగుతోంది. ఏ పార్టీది విన్..? ఎవరికి ఎంత పోలింగ్ పర్సంటేజ్..? ఏ రౌండ్‌లో ఎవ్వరికి ఎక్కువగా ఓట్లు వస్తాయి? ఇలా రకరకాలుగా బెట్టింగ్ కాస్తున్నారట.. అంతేకాదు.. గెలిచి నిలిచే పార్టీ ఏది? గెలిచినవారికి మెజార్టీ ఎంత..? డిపాజిట్ సాధించేదెవరు? డిపాజిట్ కోల్పోయేదెవరు? లాంటి అంశాలపై సైతం బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయట.. మరోవైపు ప్రలోభాలపర్వంపై నిఘా పెట్టిన ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు.. బెట్టింగ్ రాయుళ్లపై కూడా ఓ కన్నువేసిందట.. టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీ పోలీసును రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!