ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక మేనియా నడుస్తోంది. అయితే.. నిన్న సాయంత్రానికే మునుగోడు ఉప ఎన్నికల ప్రచార సమయం ముగిసింది. ఈ నేపథ్యంలో స్థానికేతరులు మనుగోడు నియోజకవర్గాన్ని వదిలివెళ్లాలని ఎన్నికల అధికారలు అదేశించారు. ఈ క్రమంలోనే కొందరు టీఆర్‌ఎస్ నేతలు ఇంకా మునుగోడు నియోజకవర్గంలో పాగ వేశారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల సంఘం, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు తలొగ్గి పనిచేస్తున్నారని మండిపడ్డారు.
Also Read : MP K.Laxman : మీ పార్టీ కుటుంబ పార్టీ అని మరోసారి రుజువయ్యింది
తక్షణమే స్థానికేతరుల మంత్రులను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, వారి అనుచరులను మునుగోడు నుండి తక్షణమే పంపకపోతే…. అవసరమైతే తానే మునుగోడు వస్తానని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలంతా తరలిరావాలని పిలుపునిచ్చే పరిస్థితి రానీయొద్దని సూచించారు. టీఆర్ఎస్ గూండాల రాళ్లదాడిలో మూడు రోజుల క్రితం గాయపడి వనస్థలిపురంలోని ఇవ్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ కార్యకర్త ప్రతాప్ రెడ్డిని, ఎన్నికల ప్రచారానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కార్యకర్త రమేశ్ యాదవ్ ను మలక్ ఫేట యశోద ఆసుపత్రిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రబాకర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు జె.సంగప్ప, రాణి రుద్రమదేవి తదితరులతో కలిసి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాళ్ల దాడి ఘటన, రోడ్డు ప్రమాద ఘటన పూర్వాపరాలను ఆరా తీశారు.
Also Read : Jagadish Reddy : ఐటీ దాడులపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి..
ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ‘‘నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో టీఆర్ఎస్ లాంటి నీచమైన పార్టీని, కేసీఆర్ లాంటి మోసగాడిని ఇంతవరకు చూడలేదు. ఓడిపోతామనే భయంతో మంత్రి మల్లారెడ్డి రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నరు. కేసీఆర్ పచ్చి అబద్దాలాడుతున్నడు. రాళ్లు, కర్రలతో తెగబడుతున్నరు. నాతోపాటు అక్కడున్న అమాయకులైన ప్రజలకు దెబ్బలు తగిలినయ్. ఏం జరుగుతుందో తెల్వని పరిస్థితి. కరెంట్ షాక్ కొట్టినట్లుగా అన్పించింది’’అని వాపోయారు.
Also Read : MP K.Laxman : మీ పార్టీ కుటుంబ పార్టీ అని మరోసారి రుజువయ్యింది
వెంటనే బండి సంజయ్ స్పందిస్తూ… తొందరగా కోలుకోవాలని, మీకు అండగా పార్టీ ఉందని భరోసా ఇచ్చారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని తేలడంతో ఆ పార్టీ నేతలు తప్పతాగి కండకావరంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలపై రాళ్ల దాడి చేస్తు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితోపాటు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు తమ కాన్వాయ్ ను అడ్డుకుంటూ దాడికి యత్నించారని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో సామాన్య ప్రజలు, పేదలెందరో ఉంటారని… ఇంత బరితెగించి చేసే దాడులతో సామాన్య ప్రజల ప్రాణాల పరిస్థితి ఏమిటనే కనీస ఆలోచన లెకుండా దాడులు చేస్తున్నారని అన్నారు.
ఒక ఉప ఎన్నిక గెలవడానికి ఇంత నీచానికి దిగాలా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల గూండాగిరి, రాళ్ల దాడి, మందు, మాంసం, మనీ పంపిణీని చూసి జనం అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఏ పార్టీ నేతలు చేసినా ఇలాంటి సంస్ర్కుతి మంచిది కాదన్నారు. ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ ఫాల్తుగాళ్లు, బట్టేబాజ్ గాళ్లు తాను రాజీనామా చేశానంటూ ఫేక్ లెటర్లు స్రుష్టించి ప్రజలను గందరగోళం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోయేవాళ్లే దాడులు చేస్తే.. గెలిచే పార్టీ… గెలిపించే ప్రజలు తిరగబడితే తట్టుకోగలరా? అని ప్రశ్నించారు.