మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.. తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచిన ఈ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 3వ తేదీన జరిగింది.. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిస్తే.. అప్పటికీ భారీ క్యూలైన్లు ఉండడంతో.. రాత్రి 10 గంటల వరకు కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది.. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు చివరి రెండు, మూడు గంటల్లో జరిగిన పోలింగ్ ప్రధాని పార్టీ అభ్యర్థుల్లో కొన్ని…
వేరే పార్టీ ర్తు మీద గెలిచినా వాళ్లకు మంత్రి పదవి ఎలా కట్టబెట్టారు? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మీరెలా 8 ఏళ్లలో ప్రతిపక్షాలను పడగొట్టి చెడగొట్టరో మేము కూడా దేశంలో ఉన్న అన్ని కోర్టులకు, మేధావులకు డేటా పంపిస్తామన్నారు.
హుజూరాబాద్ లో ఏం జరిగిందో మునుగోడు లో అదే రిపీట్ అయ్యిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. నీవూ హుజూరాబాద్ ఓటర్స్ కు పంచిన డబ్బుపై ఓటుకు నోటు కేసు పెట్టోద్దా? అని ప్రశ్నించారు. 2018 లో ఇచ్చిన అనేక హామీలు ఎందుకు అమలు చేయలేదు? అని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు రాహుల్ గాంధీ కదం తొక్కుతూ పాదయాత్రకు దిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్రంలో పదోరోజు రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కొనసాగుతుంది. నిన్న శుక్రవారం విశ్రాంతి అనంతరం నేడు భారత్ జోడో యాత్ర ఉదయం 6.30 గంటలకు సంగారెడ్డి జిల్లా చౌటకూరు నుంచి మొదలైంది.
సీబీఐ, సీఐడీ లను అడ్డుకునేందుకు పాత తేదీలతో జీవోలు ఇచ్చారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలలో ఒక్కరితో నైనా రాజీనామా చేయించారా? అంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ ప్రెస్ మీట్ లో చాలా బాధ పడుతూ మాట్లాడారు..అసలు సినిమా ముందుంది అని 15 రోజుల కింద చెప్పారు.
ఎమ్మెల్యేల కొనుగులో విషయం తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. సీఎం కేసీఆర్ దీనిపై నిన్న మాట్లాడిన మీడియా సమావేశంలో బీజేపీ శ్రేణులు ఒక్కొక్కరు ఘాటుగా స్పందిస్తూ మాటకు మాట సమాధానం ఇస్తున్నారు. ఈనేపథ్యంలో ఢిల్లీలో వున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
నిన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. ఢిల్లీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మునుగొడులో బీజేపీ గెలుపుకోసం అందరూ కృషి చేశారని అన్నారు.