మునుగోడు ఉప ఎన్నికకు రేపు పోలింగ్ జరుగునుంది. అయితే.. గత నెల రోజులుగా.. మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ పార్టీల నేతల ప్రచారాలు హోరెత్తాయి. అయితే.. నిన్న సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడింది. అయితే.. రేపు ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మునుగోడులో నియోజకవర్గంలో మొత్తం.. 2,41,795 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో.. పురుషులు 1,21,662 కాగా.. మహిళలు 1,20,126 మంది ఉన్నారు. అంతేకాకుండా.. థార్డ్ జెండర్ 07, ఎన్నారై 10, సర్వీసు ఓటర్లు 50, వికలాంగులు 5686 ఓట్లు ఉన్నాయి. అయితే.. పోస్టల్ బ్యాలెట్స్ 318 కాగా.. ఎన్నికల బరిలో 47 మంది ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 298 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 5.30 గంటలకు పార్టీల పోలింగ్ ఏజెంట్ లను నియమించుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.
Also Read : India Chem 2022: పెట్రో కెమికల్స్ రంగంలో ఏపీ దూసుకుపోతోంది..
ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ ఉంటుందని, ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. 298 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుతో పాటు.. వీటిలో 105 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఉప ఎన్నిక కోసం ముగ్గురు కేంద్ర పరిశీలకులు రానున్నట్లు.. బందోబస్తు కోసం 3300 పోలీసులు, 15 కేంద్ర బలగాల మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 100 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత 2018 ఎన్నికల్లో 91.5 ఓటింగ్ శాతం నమోదైంది. అయితే.. ఈ సారి ఎంత ఓటింగ్ జరుగుతుందో చూడాలి మరి..