మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. నిన్నటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెర పడింది. అయితే.. ఈ నేపథ్యంలో మునుగోడులో స్థానికేతరులను బయటకు పంపించేస్తున్నారు. అయితే.. అధికారి టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నేతలు మునుగోడులోనే ఉన్నారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. టీఆర్‌ఎస్ నేతలను మాత్రం మునుగోడు నుంచి పంపడం లేదంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు పూర్తి వివక్ష చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంత జరుగుతున్నా.. ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
Also Read : Dharani Portal: ‘ధరణి’కి రెండేళ్లు.. 26 లక్షలకు పైగా లావాదేవీలు
ఇంకా మునుగోడులోనే ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఉన్నారని, కలెక్టర్, పోలీసులు.. నిన్న రాత్రి 11 గంటలకు మహిళ అని కూడా చూడకుండా అమ్మగారి ఇంట్లో నుండి ఈటల జమునను బయటికి పంపించారని ఆయన మండిపడ్డారు. ఒంటరిగా ఉన్న మహిళ, ఉదయం వెళతా అని చెప్పినా కూడా అధికారులు వినలేదని, ఈ రోజు మునుగోడు నియోజకవర్గం బయట ఉన్న ఈటల రాజేందర్‌ను సైతంలా అండ్ ఆర్డర్ సమస్య అంటూ బలవంతంగా పోలీసులు పంపించివేశారు. ఇది పూర్తి వివక్ష అని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఈటల.. అధికార దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ గెలవలేక తప్పుడు దారులు వెతుకుతున్నారి ఆయన విమర్శించారు.